- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలస్తీనా నిలబడుతుంది
భూమికి బాంబుకట్టి
శవంలా గుంజుకు పోతున్నా
ఎప్పటికీ దుఃఖమే కాలమౌతుందా?
ఇంకీ ఇంకీ
భూమి నాళాల్లో
నెత్తురు ప్రవహిస్తున్న నేలలో -
బతుకు కూలిన శిథిలాల్లోంచి
శ్వాస తెగి బిగిసిన పిడికిలొకటి
లేలేతగా ఆ దేశం జండై చిగురిస్తోంది
తనను కోరుకుంటున్న ఈ భూమ్మీది
మనుషులందరిని చూస్తూ
ఆ జండా లక్షలాది ప్రాణాలపునాదిగా
ధృఢంగా నిలబడ్తుంది
నీడనిచ్చినందుకు
చెట్టునే కూల్చిన నీతి లోంచి లేచి
ప్రపంచం కళ్ళల్లో రెపరెపలాడ్తుంది
మబ్బుల్లో ఆడ్తున్న పిల్లలకు
వీరుల కథలు చెబుతూ
తన అలలల్లో ఉయ్యాలలూపుతూ
నెలవంకల్నీ నేలకు దించుతుంది
ఆటస్థలాల్నీ, పుస్తకాల్నీ
అమ్మల్నీ, నానల్నీ
నీడల్నీ, నీళ్ళనీ
తిండిగింజల్నీ ఇచ్చి
కొత్త బట్టలా మెర్సిపోయే
సూర్యోదయాలమీద
చూపు సంతకం పెట్టిస్తుంది
కల చెదరని చుక్కల అద్దకపు
నల్లని నిద్ర దుప్పటి కప్పుతుంది
పాలస్తీనా నిలబడుతుంది
ప్రపంచమంతా పోరాట నేలల్లో
-వడ్డెబోయిన శ్రీనివాస్
98857 56071
- Tags
- Poem