థియేటర్

by Ravi |   ( Updated:2024-11-17 18:30:52.0  )
థియేటర్
X

ఆశల వలలో మనుషులం

మానవత్వం ఘనంగా సాంద్రంగా

లోపిస్తున్న పాత్రధారులం మనం

థియేటర్‌పై వచ్చీపోయే జీవులం

నలుపు తెలుపు చలనచిత్రంలో

చీకటి వెలుగుల బతుకు

రంగుల సినిమా విప్పారిన

ఆట అందాల ఒయ్యారాలేలే ఆకాశం

ఏ పాత్రైనా చేయవచ్చు

జంకుకొంకు లేక ఎప్పుడైనా ఎవరైనా

నయానో భయానో

ఇక్కడ చక్రం తిప్పే మనిషే హీరో

నాటకం రక్తికట్టే

నటనలో ఏ వేషమైనా వేయవచ్చు

ఏ నిబంధనలూ షరతులూ లేని

పోటీ ప్రతిభ నీదీ నాదీ

నింగీనేలను చుట్టేసే నీలో నాలో

ఆహార్యం ఆకలి ఒకటే కాని

మనలో అభినయం వేర్వేరు

కనిపిస్తున్న మనిషి మాత్రమే

ఒక్కడుకాని ఒక్కడు

ఈ థియేటర్ మహా అద్భుతం అనంతం

డా.టి.రాధాకృష్ణమాచార్యులు

98493 05871

Advertisement

Next Story