- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒక తుపాన్ రాత్రి
తెలిపిరి ఇవ్వని గాలి వాన
రేయిజాలా పడుతూనే ఉంది
గోడ సొరగులో దీపం బుడ్డీ
బితుకు బితుకుమంటూనే ఉంది
అరుగుల ఉద్దరలు
వాన సింఛకు వొరిగిపోగా
ఎర్రమట్టి వోర్పులు
వాన నీటికి ఓలకం కట్టాయి
పెనకలు కారిన కాడల్లా
దాకా, దోకి, ముంత, మూగుడు
వరద పాకిన కాడల్లా
గుడ్డా పాత, గోనె, గోసి
జిబ్బు రేకులన్నీ ఒక్కొక్కటిగా
నౌకాయానానికి ఒడిగట్టాయి
గొందులోన కోళ్ళ ఊజు
పల్లం వైపు పరుగులు పెట్టింది
అట్టుగపై నిలకవైన
వెన్నుగర్ర సిగళం నీరు
జప్పున పొయ్యిలో దూరి
చింత నిప్పులు ఆర్పేసింది
మెరుపుల మిటకరింపులు
తలుపు ఇరకలు కసెల్లీ
తడి తగలని జాగా కోసం
దేవుతున్నన్నట్టుంది యవ్వారం
ఉరుముల చప్పుళ్ళ ఒరిపిడికి
కంగోరు మీద కంచాలు
చావు దరువులు
వేస్తున్నట్టనిపిప్తోంది బాగోతం
గానుగెద్దులా ఇంటిని చుడుతున్న
బగిరిపిట్టల రెక్కల చప్పుడు
పొరుగునెక్కడో ఎగిరిపోతున్న
రేకుల చప్పుడును మెడ్డేసింది
కూలిన చెట్టు కన్నాల్లోంచి
కుంకినక్కల ఏడుపులు
మందగువ్వల ఉలుకులు
ముంజారులో పాడెత్తుతున్నట్టుంది
రెండు కాళ్ళు ముడుచుకొని
రోలుపట్టు దగ్గర ఉగ్గేట్టుకుంటే
వరద నీరు చిమ్మి పిట్టగోడ కూలి
చిలక్కొయ్య భుజానికి నాటేసింది
నిద్రెందుకు మట్టేసిందో తెలీదు
తెల్లారిన ఎంతకో తెలివికొనేసరికి
మొండి గోడల మీదుగా సూర్యుడు
మా కోసం దేవుతున్నట్టనిపించింది
కళ్ళు పులుముకొని తేరపార చూస్తే
అగుపడిన మేరల్లా
కూలిన చెట్లల్లా కూకటి వేళ్ళతోనే
ఇంకా మేమే నయం అనిపించింది!
-వినోద్ కుత్తుం
96343 14502
- Tags
- Poem