ఓట్ల దారి

by Ravi |   ( Updated:2024-06-30 18:45:59.0  )
ఓట్ల దారి
X

ఓటు అమ్మొద్దు!

ఎన్నికల రణగొణలు

వద్దంటే మానేదా,

నోటుకు ఓటు?

ఇవ్వడం ఆగదు,

తీసుకోవడం - వెయ్యడం ఆగదు!

ఆగే సూచన లేదు,

కనుచూపు మేర!

నిరంతరం,

తరం, తరం!

ఆలోచనే ఆధారం!

ఆధారం మారక,

నిర్మాణం మారదు!

ఐదేళ్ళకి వేసేదే ఓటు కాదు.

జీవితంలో ఎన్నో సార్లు,

వందల మార్లు వేసేది ఓటు.

చేరే బడికి ఒక ఓటు,

చదవడమా, ఆడడమా?

కష్ట పడటమా, కాపీ కొట్టడమా?

అబద్దమాడటమా? శిక్ష కోరడమా?

డాక్టరా, ఇంజినీరా?

ఉద్యోగమా, వ్యాపారమా?

స్వార్థమా, త్యాగమా?

అడ్డ దారులా, శ్రమయేవ జయతే?

లంచమా, జీతమా?

సత్య మార్గమా, తాత్కాలిక సౌఖ్యమా?

ఆత్మ సాక్షా, ఆత్మ వంచనా?

ఇవన్నీ ఓట్లే!

ఓటు ఒక గుణం, లక్షణం, జీవన విధానం!

ఆలోచన, ఆశయం!

అన్ని సార్లు ఒకలా ఓటేసి,

ఐదేళ్లకు ఒకసారి మారమంటే

మారదు ఆ గుణం!

ఓటు దారి

ఒక్కసారి మారదు,

మారాలంటే,

జీవిత దృక్పథం మారాలి!

ప్రొ. సీతారామరాజు సనపల

డీఆర్‌డీఓ విశ్రాంత సైంటిస్టు

72595 20872

Advertisement

Next Story

Most Viewed