అరుంధతి ...!

by Ravi |   ( Updated:2024-06-30 18:45:59.0  )
అరుంధతి ...!
X

కాశ్మీర్ కుంకుమ పూల తోట

ఎందుకు నెత్తురోడుతున్నదోనని

గుండెకు హత్తుకున్న అరుంధతి ఎక్కడ?

పెల్లెట్లకు నేల రాలుతున్న

బృహన్ లాంటి చిన్నారుల

తల్లిదండ్రుల ఆర్తనాదాన్ని

అక్షరబద్ధం చేసిన ఆ అరుంధతి ఎక్కడ?

ఆకాశం మీద నుండి యుద్ధ మేఘాలను

కమ్ముకొస్తున్న దండకారణ్యాన్ని

తన కౌగిలిలో ఆలింగనం చేసుకున్న

అరుంధతి ఎక్కడ?

గొంతు లేని ప్రజల గొంతుకై

అడవి ఆదివాసీ ప్రజలదే అంటూ

అడుగులు వేసిన ఆ అరుంధతి ఎక్కడ?

స్త్రీ స్వేచ్ఛా కోసం

పితృస్వామిక వ్యవస్థలో నిత్యం

బలైపోతున్న ఆడబిడ్డల స్వరమైన

ఆ అరుంధతి ఎక్కడ?

దేశమైనా, ప్రపంచమైనా హద్దులు లేని చోట

నిత్యం అగ్రరాజ్యాల యుద్ధంలో

బలైపోతున్న పాలస్తీనా, సిరియా

ప్రజల ఆకాంక్షను

ఎత్తిన అరుంధతి ఎక్కడ?

సామ్రాజ్యవాద విపణిలో

దేశ దేశాలను బందీలను చేసి

బందూకులను తన పౌరుల మీద

గురిపెట్టి కాల్చుతున్న చోట

కాగడైన ఆ అరుంధతి ఎక్కడ?

ఇప్పుడు ఎక్కడైనా

అన్యాయాన్ని అక్షరబద్ధం చేసేవాళ్లు

న్యాయంకై పోరాడే వాళ్ళు

దేశ ద్రోహ జాబితాల్లో ఎక్కగలరు..

రాజ్య ద్రోహం అనే బిరుదు అందుకోగలరు..


వంగల సంతోష్

95737 86539

Advertisement

Next Story

Most Viewed