- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆకలి బతుకులు
చింపిరి జుట్టుతో
చీమిడి ముక్కుతో
చిరిగిన చొక్కాతో
చెమ్మగిల్లిన కళ్ళతో
నెత్తిన బోలె పెట్టుకొని
భుజాన జోలె కట్టుకొని
అన్నం మెతుకుల వెతుకులాటలో
మా బతుకులు కోసం పోరాటం
ఎండల్లోనే మా సావాసం
చెట్ల కిందే మా ఆవాసం
ఆకలి కోసమై ఆరాటం
ఖాళీ కడుపుతోటే రోజంతా ఉపవాసం
పాల కోసం మా పిల్లల
ఏడుపులు ఒకవైపైతే
మరొక వైపు సినిమా పోస్టర్లకు
జనాల పాలాభిషేకాలు
ఆకలేయని దేవునికేమో
గుళ్లో నైవేద్యాలు
ఆకలిసే మాకు గుడి బయట
కొబ్బరి చిప్పలు
ఆకలితో కడుపు కాలుతోంది
కళ్ళు మబ్బులు కమ్ముతున్నాయ్
నోట్లో నాలుక తడారుతోంది
శరీరం సత్తువ లేక నిస్సహాయ స్థితిలో
మురికి కాలువ పక్కన పడుంటె
మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు
దోమలు మా రక్తాన్ని పీల్చి పిప్పిచేస్తున్నాయ్
ప్రాణం లేని రాతిలో దేవుణ్ణి
చూసే ఈ సమాజం
ప్రాణం ఉన్న మాలోని ఆకలిని
గుర్తించడం గుర్తించడం లేదెందుకో
ఇవేమి మాకు కొత్తేమి కాదు
కాలంతో పాటే మా పయనం
కాలాలైతే మారుతున్నాయి
కానీ మా బతుకులే మారడం లేదు.
కోనేటి నరేష్
84998 47863
- Tags
- poem