- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాట రూపం మార్చుకుంది
X
ప్రజల పక్షాన ఉండాల్సిన పాట
పాలకుల పక్కన చేరింది
పేదవాడి జోలి అయిన పాట
పెద్దోడి జోలపాట అయింది!
గరీబోడి బతుకు పాట
ముస్తాబయి గడీలలో తిరుగుతుంది!
అన్నార్తుల ఆర్థనాదమైన పాట
అధికార దాహానికి బానిస అయింది!
ఖన ఖన మంటూ
నిప్పు కణమై మండే పాట
కాసుల గల గలలకు
విలువల వలువలు వొదిలేసింది!
విప్లవ శంఖమై రణధ్వని
వినిపించాల్సిన పాట
గతం మరిచి విగతమై
ఆశల పెట్టెలో సమాధి అయింది!
స్వేచ్ఛా విహంగమై ఎగిరే పాట
పంజరం లోని చిలుకయింది
కడుపులో కత్తులు ఉన్న వాడి
కౌగిలింతల మత్తులో ఉంది!
పాట పార్టీలు మారుతూ
వేదిక వేదికకు వేరు వేరు
రూపాలు దాల్చుతుంది
అధికారానికి అర్రులు చాపుతుంది!
ప్రజల గుండె చప్పుడుగా
ఉండాల్సిన పాట
చప్పట్లు కొడుతూ పాలకులకు
భజన చేస్తుంది!
పాట రూపం మార్చుకుంది!
ప్రజ కోపం ఆపుకుంటుంది!!
జగ్గయ్య.జి
9849525802
Advertisement
- Tags
- poem
Next Story