వారం వారం మంచి పద్యం: వేరు

by Ravi |   ( Updated:2023-08-20 18:30:20.0  )
వారం వారం మంచి పద్యం: వేరు
X

వేడిగాలులు, ఉక్కపోత, మండువేసవి, పగటి సమయం, బైక్‌పై బుంగి బయల్దేరాడు. అల్లకల్లోల మానసం, సగం నిండిన కడుపు, ఫలితంపై ఆదుర్దా, తన ఆరోగ్యంపై కలవరం. టెస్ట్ రిపోర్ట్స్ అందుకుని డాక్టర్ వద్దకెళ్ళాడు. ఆపరేషన్‌కు తయారవమన్నాడు డాక్టర్. టెస్టులు అనేకం జరిగాయి. టెక్నిషియన్‌తో టెస్ట్‌కు ఒక రేటు. డాక్టర్ ద్వారా టెక్నీషియన్ వద్ద కెళితే ఒక రేటు. ఇలాంటి పద్ధతులు ఊపిరాడనివ్వకుండా చేస్తే, ఖాళీ జేబులు వెక్కిరించాయి. అన్నీ సర్దుకొని ఆపరేషన్ థియేటర్ కెళ్ళాను. లోకల్ అనస్థీషియా వల్ల విని, మాట్లాడగలిగే స్థితిలోనే ఉన్నాడు. డాక్టర్, మత్తు డాక్టర్‌తో కలిపి నలుగురైదుగురు థియేటర్‌లో ఉన్నారు.

నాతో వస్తవా. వేరు వేరు చోట్ల ఆపరేషన్స్ ఉన్నవి అని సహాయకునితో డాక్టర్ అన్నాడు. 'నేను ఎక్కడికీ రాను' అన్నాడు సహాయకుడు. ‘అంత రిలీఫా. గత వేసవిలో ఉన్న బిజీ ఇప్పుడు లేదులే’ అన్నాడు నిష్టూరంగా డాక్టర్. అంతా వింటున్న బుంగి ఆలోచనలో పడ్డాడు. వైద్యుని ఆరాటం, రోగికి ప్రాణసంకటం. ఖరీదైన పనిముట్లు, పరీక్షలు, పద్ధతులు కలిసి వైద్యం ఖరీదైంది. అది రోగికి రక్తపోటు తెచ్చేలా ఉంది. ‘ఏం ఆలోచిస్తున్నావు. చూస్తున్నావా? ఆపరేషన్ ఎంత కష్టమౌతుందో’! 'మీరు ఓపికస్తులు. మంచి డాక్టర్ అని చెప్పారు. ఇవాళ రేపు మంచి ఎక్కడిది!' అతని మాటకు భయమేసింది. బుంగి నోటికి తాళం పడింది.

ఇడుముల వలన బాధలు ఇనుమడించు

తనదు తెగువయె ఎపుడును తనకు రక్ష

వృత్తి కరుణలు ఈనాడు వేరు వేరు

కశప చెప్పిన కధనమ్ము కాంతి పధము

డా. బి.వి.ఎన్ స్వామి

92478 17732

Advertisement

Next Story

Most Viewed