- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
వారం వారం మంచి పద్యం: మర్మము
రావణ లంకకు నిప్పంటించి కిష్కింధకు చేరిన హనుమంతుడు, వానరులతో అనేక విషయాలు చెబుతూ, అక్కడ పూలన్నీ ఎరుపు రంగులోనే ఉన్నాయని అంటాడు. వానర ప్రముఖులు ఆ మాటను ఖండిస్తూ నీవు కోపంతో ఉన్నావు కనుక అక్కడ పూలన్నీ ఎర్రగా కనిపించాయని చెబుతారు. ఈ విషయం చదివాక రచయిత మంచి మనస్తత్వ శాస్త్రవేత్త అని అనిపించింది. అన్నాడు బుంగి.
‘ఆ రోజుల్లో మనోవిజ్ఞాన శాస్త్రము ఉందా’ అడిగాను.‘ఈ రోజు మనకున్న విజ్ఞానంతో అలాంటి నిర్దారణకు వచ్చాను. నా నిర్దారణకు ఆధారం కూడా ఉంది. 20-06-2023 శుక్రవారం రాత్రి 7:20 గంటలకు ఒడిశా రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మృతులు 288 వరకు, క్ష్రతగాత్రులు వేలాదిగా ఉంటారని తెలిసింది. ఆ ప్రమాద సహాయక చర్యల్లో అవిశ్రాంతంగా పాల్గొన్న సిబ్బందిలో కొందరు మానసికంగా కుంగుబాటుకు గురయ్యారు. నీళ్లను చూసి నెత్తురు అనుకున్నారు. బయటకు తీయలేనంత లోపల చిక్కుకుపోయిన మృతదేహాలున్న చోట పనిచేసిన వారు దేన్ని చూసిన ప్రమాదంగా భ్రమించారు. మానసికంగా దెబ్బతిన్నారు. వారికి కౌన్సిలింగ్ ద్వారా మర్మము తెలిపారు. ఇలాంటి స్థితే హనుమంతుడిది కూడా. సీతమ్మకు జరిగిన అన్యాయానికి అతని కళ్ళు ఎరుపెక్కాయి. మనసు కుతకుతలాడింది. దానివల్ల రంగురంగుల పూలు కూడా ఎరుపు రంగులోనే కనిపించాయి’. ‘నీ పరిశీలన భలే ఉంది’ అన్నాను.
మదిని నాటిన విషయము మరచిపోక
తలచి భ్రమల గడుపుట తప్పు అగును
మర్మము తెలిసి మసలిన మంచి జరుగు
కశప చెప్పిన కధనమ్ము కాంతి పధము.
డా. బి.వి.ఎన్ స్వామి
92478 17732
- Tags
- poem