ఒంటరి కలయిక

by Ravi |   ( Updated:2023-06-04 18:31:12.0  )
ఒంటరి కలయిక
X

ఇష్టంగానో అయిష్టంగానో

నీటిని ప్రేమిస్తున్న శక్తి ఏదైనాగానీ

దాని సహజ గుణాన్ని చుట్టేస్తది

కానీ, నీటి అస్తిత్వం

కురిసే మబ్బులో ఉరుమై

తేటతెల్లంగా ఖుల్లంకుల్లంగా కనిపిస్తుంది

నీటికీ పల్లానికి

విడదీయలేని అనుబంధముంది

కిందకు జారడమే దానికి తెలుసు

లోయల లోతులూ అగాధాలు అక్కున చేర్చుకుంటాయి

ప్రేమగా నీటి చుక్కలను

అదే ఒంటరి కలయిక

గలగలా గాలిలా

కిలకిలా మనిషిలా మాట్లాడడం అంతర్మఖునిలోని దినచర్య

కాలానుకూల స్పందనగా

బయటికొస్తదేమో చూడు

అదే మరి ఒంటరి కలయిక

దాపరికం చెంగు మతలబుమో కానీ

అన్యాపదేశంగా కలుస్తుంది రిలేటివ్ రిలేషన్లో

రెండు గొంతుల పర్వంలో

మారాకు వేయని కలయిక ఒంటరే

మౌన భాషలో మాటేమో

అలల లయ లేని హృదయం

మితభాషిది మధుర భాష గానీ

వాస్తవం విప్పలేని ఖాళీ మూటలు

ఓ మసక చీకటిలో నివద్దె అద్దం

అదే కదా ఒంటరి కలయిక గీతం

డా.టి.రాధాకృష్ణమాచార్యులు

9849305871

Advertisement

Next Story

Most Viewed