ఆమె చిరునవ్వు

by Ravi |   ( Updated:2023-06-04 18:30:42.0  )
ఆమె చిరునవ్వు
X

ఎంతో అందమైనది ఆమె చిరునవ్వు

రోజుల కొద్దీ చూస్తూ ఉండాలనిపించేలా

మనసైతే నిజంగా మాయాజాలమే

జీవితకాలపు తోడు కోరుకునేలా

నారింజరంగు సూర్యాస్తమయాలతోను

చల్లని వెన్నెల రాత్రులతోను

పరిమళించే పూబాలలతోను

వర్ష భీభత్సాలతోను

ఆమె ప్రేమలో పడుతుంటుంది

చిత్రంగా అవన్నీ కూడా

ఆమెని అర్థం చేసుకున్నట్టుగా

తన హృదయపు భాషలో మాట్లాడుతాయి

తన చుట్టూ ఉన్న ప్రతిదానిలోనూ

ప్రేమే కనిపిస్తుంది ఆమెకి

సముద్రతీరాల్లో శంఖాలను

కలల్లో సుదూర నక్షత్రాలను

ఏరుకుంటూ ఆనందిస్తుంది తాను

వర్షంలో ఆమె నర్తిస్తుంటే

భూమి-ఆమె మాత్రమే వినగలిగే

మనోహర సంగీతాన్ని ఆలపిస్తుంది !!

-హిమజ

94404 83001

Advertisement

Next Story

Most Viewed