- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమీక్ష: ఆధునిక భావాల దొంతర
ఎన్నో బ్రేకులు ఉన్న జీవితాలలో మలుపుల మధ్య మరెన్నో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ప్రయాణాలన్నీ సాఫీగా సాగిపోతుంటే ఏమవుతుంది? రొటీన్ లైఫ్‌లో ఉండే ప్రతి చిన్న మార్పు మనిషి మెదడుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వాటితో మానవ సంబంధాలలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తన తొలి కథల సంపుటి 'బ్రేకింగ్ న్యూస్'లో చిన్నచిన్న పాత్రల ద్వారా ప్రత్యేకంగా చూపించారు దేశరాజు. కథలలో నిత్య జీవితంలోని వాస్తవిక ధోరణే ఉంటుంది. పాత్రల మధ్య కాల్పనికత ఎక్కడా కనిపించదు.
పాత్రలు మనతో మన పక్కనే ఉండి సంభాషిస్తున్నట్లు ఉంటాయి. కథకి మెళకువ ఎంత ముఖ్యమో దేశరాజు కథలలో మనకు అర్థమవుతుంది. పెద్దగా నిడివిలేని పాత్రలు అలవోకగా వచ్చిపోతూ ఉంటాయి. చిన్నచిన్న అంశాలనే కథలుగా మలుస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వాతావరణాన్ని నిర్మించాలో అంత బాగా కథా నిర్మాణం కూడా చేశారు. స్పష్టత, సూటితనం, సరళ వాస్తవికత ఈ కథల ప్రత్యేకతగా చెప్పవచ్చు. మానవత్వంలోని మెత్తదనం, వ్యంగ్యం తారసపడతాయి.
ఎన్నో వైవిధ్యాలు
కూతురిని వదిలి ఉండలేని తండ్రి 'ఎక్కడో ఒక దగ్గర సంతోషంగా ఉందనే ఆనందం వేరు. అసలు లేదనే వాస్తవం వేరు' అంటూ హాస్టళ్లో బలవంతంగా చదివించాలనుకునే తల్లిదండ్రుల మనోగతాలను ఆవిష్కరించారు. టబ్బు కింద పావురం రెక్కలు కొట్టుకోవడాన్ని, హాస్టల్‌లో పిల్లలను వదిలి తల్లితండ్రులు ఉండలేనితనాన్ని వివరించిన తీరు బాగుంది.
ర్యాంకుల కోసం పోరాడుతున్న పిల్లలు లోకజ్ఞానం తెలియకుండా ఎలా పుస్తకాల పురుగులు అవుతున్నారో, కనీసం ఇంటికి చేరే దారి కూడా తెలియకుండా ఉంటున్నారో ఫారం కోళ్లతో పోల్చి చెప్పిన కథ ఆలోచింపజేస్తుంది. ఎమోషనల్‌గా టర్న్ తీసుకునేది 'ఫేక్ డాక్టర్స్' ఈ సమాజంలో మధ్యతరగతి జీవితాలపై ప్రభావం చూపే హాస్పిటల్, అక్కడ వైద్య విధానాలలో వస్తున్న కొత్త ప్రక్రియలతో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో ఈ కథ మన ముందుంచుతుంది.
సమాజం మీద గౌరవం
దేవరాజు రచనలో సామాజిక, రాజకీయ స్పష్టత కనిపిస్తుంది. బహుజన సిద్ధాంతాల పట్ల గౌరవం, లెఫ్ట్ అభిప్రాయాల వైపు మొగ్గు ఉంటాయి. కవిగా దాక్కోవడానికి అలవాటు పడడం వల్లననో ఏమో, ఒకటి రెండు కథలలో పూర్తిస్థాయి ఎక్స్‌ప్రెషన్స్ మిస్ అవుతాము. ఫిలాసఫికల్ టచ్, మోటివేషనల్ వర్డ్స్ ఈ కథలలో కనిసిస్తాయి. శారీరక లోపం ఏర్పడినప్పుడు 'ప్రాణం పోయినా బావుండు' అనుకోవడం ఎంత సాధారణమో, ఆ మానసిక స్థితిని ఎదుర్కోవడానికి మనిషి మాటలతో 'ఆశల రెక్కలు' ఇవ్వాలని చెప్పిన కథ మనసుని ఆకట్టుకుంటుంది.
'బల్లి కాదు బెబ్బులి, పులి చంపిన లేడి నెత్తురు కాకపోయినా, బుక్క గుండా వంటిపై చల్లుకున్నవాడు, విప్లవాలేమీ చేయకపోయినా అమ్మా నన్ను కన్నందుకు విప్లవ అభినందనలు' వంటి మాటలతో ఎనర్జీని నింపుతారు. 'హలోవిన్ డే' పేరుతో కొత్తగా పెళ్లయిన జంట మధ్య వచ్చే చిలిపి తగాదాలను హాస్య చతురతతో చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. పునరుజ్జీవం, గృహమే కదా స్వర్గసీమ, ఏది దారి పండుగొచ్చింది, జ్ఞాన గుళిక కథలలో సాంప్రదాయ కుటుంబ పద్ధతులపైన ప్రేమ కనిపిస్తుంది. ఉద్యమాలు ఉధృతంగా ఉన్న సమయంలో అనేకమంది యువకుల జీవితాలలో జరిగిన కల్లోలానికి చిక్కని అక్షర రూపం ఇచ్చారు. దేశరాజు కథలలో ఆధునిక భావాల దొంతరని చూడొచ్చు.
ప్రతులకు:
ఛాయా పబ్లికేషన్స్
మథురానగర్
98480 23384
పేజీలు 130, వెల రూ.100
సమీక్షకులు:
రూపరుక్మిణి.కె
- Tags
- book review