- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతరంగం: ఆరోగ్యానికి.. హాని కల్గించేవే కొంటున్నం!
ప్రకృతిని పర్యావరణాన్ని ఏర్పడకుండా ధ్వంసం చేసే సంస్కృతి దాపురించింది ఎల్లెడలా వ్యాపించింది. ప్రపంచం అంతా ప్లాస్టిక్ నిండిపోతంది. ఇది మంచిది కాదు అని అందరికీ ఎరికే అయినా నడుస్తూనే ఉన్నది. అసలు మనం పైసలు పెట్టి రోగాలు అల్కగ కొనుక్కొంటున్నం. పూర్వకాలంల చేదబాయి నీళ్లు చేరుకొని బిందల వడపోసి తాగేది. అందులో మనకు అవసరమైన మినరల్స్ అందులోనే ఉండేవి. కానీ ఈ ఇరవై ఏండ్ల నుంచి ఏమైంది, మినరల్ వాటర్ పేర మినరల్స్ తొలగించిన నీళ్ళను కొనుక్కోని తాగుతున్నం. కొనుక్కున్న నీళ్ళు తియ్యగా ఉండటం వల్ల అన్ని ఊర్లల్ల పట్నాలల్ల ఆర్ ఓ మినరల్ వాటర్ ప్లాంట్లు ప్రారంభం అయినయి. ఇప్పుడు ఏ ఇల్లు చూసిన ఆర్ ఓ నీళ్ళనే వాడుతున్నం. అందులో ఉండాల్సినన్నీ ఖనిజాలు కరిగించడం వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వస్తున్నయి.
పర్యావరణానికి సైతం హాని!
అయినా నీళ్ళు కొనుక్కోవడం జీవితంలో భాగం అయ్యింది. ఒకప్పుడు పది రూపాయలకే ఉన్న బాటిల్ ధర ఇప్పుడు ఇరవై అయిదు అయ్యింది. అప్పుడు బస్‌స్టాండ్‌లలో పది రూపాయలకే ఉన్న బాటిల్ ధర ఇప్పుడు ఇరవై అయిదు అయ్యింది. అప్పుడు బస్‌స్టాండ్‌లలో మంచి నీటి నల్లాలు ఉండేటివి. గ్రామాలలో కూడా మంచి నీళ్ళ నల్లాలు ఉండేటివి ఎక్కడికి పోయినా చెంబులో తాగేందుకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవలింటికి పోయిన ఏ సమావేశంకు వెళ్ళినా ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్ళు ఇస్తున్నారు. క్షార గుణాలు ఆమ్లగుణాలు ఉన్న నీళ్ళ నుంచి ఖనిజాలను వడకట్టడం వల్ల నీళ్ళు తియ్యగ పలచగ తయారు అయితయి. ఆ నీళ్ళు వాడటం వల్ల దీర్ఘకాలంలో రోగాలు వస్తున్నయి. అయినా వాడటం మానడం లేదు.
పల్లీలు 140.. నూనె 150
అట్లనే పూర్వకాలంలో పల్లినూనే, నువ్వుల నూనెలు గానుగా ద్వారా పట్టించి తెచ్చుకునేది లేదా మిల్లులలో నుంచి తెచ్చుకునేది. ఇప్పుడు నూనె ప్యాకెట్లు కొంటున్నం. పల్లీలు 140 రూపాయలకు కిలో అమ్ముతున్నరు. ఒక కిలో పల్లి గింజల ద్వారా నూనె తీస్తే అరకిలో మాత్రమే ఉత్పత్తి అయితది. మరి ఒక లీటర్ పేరుతో వచ్చే కిలో పాకెట్‌కు 150 వరకే ఎట్లా ఇస్తున్నరు. అంటే ఇందులో ఏదో కల్తీ అవుతున్నట్టే కదా. మంచి నూనె పేరు మీద నూనెల్లొనూ ఇంకో అయిల్ కలుపుతున్న విషయం తెల్సిపోతుంది. అయినా మనమంతా ఆ నూనెలే వాడుటకు ఇరవై ఏండ్ల నుంచి అలవాటు పడ్డం.
ఒక్క నూనెలు నీళ్ళు మాత్రమే గాకుండా మన ఆరోగ్యానికి హాని కలిగించే అన్నింటిని కొనుక్కొని వాడుతున్నం. మనం తినే కూరగాయాల్లో, చికెన్‌లో, మనం తినే పండ్లల్లోనూ క్రిమిసంహారక అవశేషాలు ఉన్నయి. అయినా కొంటున్నాం వాడుతున్నం. ప్రతి వస్తువును ప్లాస్టిక్ పేపర్ ప్యాకింగ్‌తో వస్తుంది. ఇవన్నీ పర్యావరణానికి హాని కల్గించేవే ఆరోగ్యానికి హాని కల్గించేవే. కానీ వీటిపై ప్రభుత్వాలు చూసి చూడనట్లు ఉంటాయి. వినియోగదారులకు అల్కగా దొరకుతాయి. హెల్త్ పాడయిపోయేది ప్రజలకు ఆ తర్వాత వైద్యుల దగ్గరికి ఆసుపత్రులకు అందులోనూ మనకు అవసరం లేని పరీక్షలు అవసరం లేని మందులు వాడుతూనే ఉంటున్నం.
అన్నవరం దేవేందర్
94407 63479