- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలోచనలు తారుమారు చేయడమే రాజకీయం!
ఉన్నది ఉన్నట్టుగా కాకుండా లేనిది ఉన్నట్టుగా ఊహలను నిజమని నమ్మించడం విషయాన్ని మ్యాన్‌ప్లేషన్ చేయడం అధికార సోపానంలో మీది మెట్టుకు చేరుకోవచ్చు. ఎన్నడైనా ఎప్పుడైనా పాలకులు ప్రజలను నమ్మించడంలో నిరంతరం తమ వైపుకు మనసు నిలపడం ఆశలకు గురిచేయడంతోనే లింక్ కొనసాగుతది. అప్పుడే ఓట్లు పడేట్టు రూపకల్పన జరుగుతుంది. అప్పుడే పీఠం ఎక్కుతరు. పవర్‌లో ఉన్న పాలకులకు అన్ని హంగులు ఆర్భాటాలు ఉంటాయి గనుక ఆలోచనలను తారుమారు చేయడం సులువు అవుతుంది. అధికారం బయట ఉన్నవాళ్లు కొంచెం కష్టపడాలి. సూక్ష్మంగా చెప్పాలంటే ఓటర్ల నాడి పట్టుకోవాలంటే లేనిది ఉన్నట్టుగా కానిది అయినట్టుగా, కాకున్న అయినట్టుగా ప్రచారం చేయాలి.
మనసులో నాటుకపోయేటట్లు..
అన్నిటికీ ప్రచారం ప్రాపంగానే ముఖ్యం ఏదైనా బహుళజాతి సంస్థ తయారు చేసిన వస్తువు అమ్మాలంటే దాని గూర్చి టీవీ, రేడియో, పేపర్, సోషల్ మీడియాల్లో ప్రకటన జోరు పెంచితే చాలు.. అలా చేస్తే కొనేటోడు డిటర్జెంట్ పౌడర్ కావాలని అడుగడు సర్ఫ్ ప్యాకెట్ కావాలని అడుగుతాడు. మరో కంపెనీది కావాలంటే త్రిబుల్ ఎక్స్ సర్ఫ్ అనే అంటడు. అట్లా మనసులో నాటుక పోయేటట్లు రుద్దడం జరుగుతది. అందుకే మనం లామినేటెడ్ షీట్ అని కాకుండా డెకోలం కావాలని అడుగుతం. ఎర్త్ మూవర్ అని పిలవకుండా జేసీబీ అని పిలుస్తున్నాం. వ్యాపారం ఎట్లనైతే మనసు మీద ముద్ర వేస్తున్నామో, రాజకీయాలు ఓట్లు అట్లనే వస్తున్నాయి. అందుకే వ్యాపార సంస్థల ప్రమోషన్‌కు అవసరమైనట్టు పార్టీలకూ వృత్తి వ్యూహకర్తలను నియమించుకొనేందుకు ఎట్లా బుట్టల వేసికోవాలో తెలిపే పెద్ద పెద్ద చదువులు చదివిన వాల్లు ఎన్నికల వ్యూహ సరళిని ఆయా పార్టీల ప్రాంతాల ప్రజల నాడిని పట్టి పథకాలు వేస్తున్నారు.
ప్రజలకు మరపు ఎట్లాగు ఉన్నది ఒక రాజకీయ నాయకుడు లేదా ఆ పార్టీ ఎన్నిసార్లు అన్యాయం చేసినా తిరిగి అదంతా మరచిపోతున్నారు. వీడు చెడ్డవాడు కదా ఈ పార్టీ ఫలానా అప్పుడు ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసికుంది కదా. దీనికి ఎట్లా వేస్తా వేస్తామన్న స్పృహ లేకుండా పోయింది. ఎందుకంటే అవి చేసిన లేదా చేసినట్టు కన్పించిన కొన్ని పథకాలను చెవిలో జోరిగలాగా ప్రచారంలో పెడతారు. అక్రమాలను మరిచి నిరంతరం చెవిలో వినిపించే దాని వైపు నిలబడేట్టు చేస్తారు. పైగా ఓట్లు వేసిన తర్వాత మళ్లీ ఐదేండ్ల వరకు ఆ ఓటరు తమతో అనుసంధానం అయి ఉండేట్లు ఇట్లాంటి శిక్షణ పొందిన పార్టీ కార్యకర్తలు సమస్యలు పరిష్కరించడం, సంక్షేమ పథకాలు అందేట్టు చూడటం చేస్తుంటారు. దీనికి ఆ ఓటరు యొక్క సామాజిక వర్గంను ఆ ఓటరు యొక్క వృత్తి వ్యవహర సంఘాలను మచ్చిక చేసుకోవడం ఇగ ఆఖరుకు ధన ప్రవాహం ఉండనే ఉంటది. ఇవన్ని చేసేందుకు పైసలు అవసరం అవుతాయి. రాజకీయ నాయకులకు డబ్బులు ఎట్లా వస్తాయో అందరికీ తెలిసిన వ్యవహారమే.
అదే విజయ సూత్రంగా..
అవినితీ అక్రమ సంపాదనకు ప్రజలు కూడా ఇది కామనే కదా అనుకునే స్థాయికి తీసిక వచ్చారు. వరకట్నం తీసుకోవడం నిషేధం దీనికి శిక్ష కూడా ఉన్నది. అయినా పెండ్లి చేసుకునే వరులు తీసుకుంటున్నారు. ఎవరూ ఆక్షేపించడం లేదు. రాజకీయ అధికార అవినీతిని కూడా అంతా కామన్‌కు తీసిక రాబడింది. ఏది ఏమైనా ఓటర్లను మచ్చిక చేసుకోవడం వాళ్ళను తనవైపుకే నిలుపుకునేట్లు చేసుకోవడం ప్రభావం అయిపోయింది. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు చేసుకునే ఆరోపణలు కూడా చిత్రంగా ఉంటాయి. ఇప్పుడు కుంభకోణం అంటే మరి నీ హయాంలో దీని మాటేమిటి అంటూ ఎదురు దాడికి దిగడం కామన్ అయ్యింది. వాగ్దానాలు అమలు కాకున్నా మరిచి పోయేట్టు చేయడం స్పష్టమైన ఆలోచన రాకుండా కమ్మటం విజయ సూత్రంగా పరిణమించింది.
అన్నవరం దేవేందర్
94407 63479