- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతరంగం: తెలుగుకు మరో పేరు తెలంగాణ
తెలంగాణ భాష ఒకప్పుడు సినిమాలలోకి ఎక్కిరియ్య బడ్డది. కానీ, ఇప్పుడు లేదు. ఒక గౌరవంగానే ఉన్నది. సినిమాలలో డాక్యూమెంటరీలలో తెలంగాణ భాష మాట్లాడే సొగసైన పాత్రలను పెడుతున్నరు. పాటలు కూడా వస్తున్నాయి. ఇదంతా భాష పట్ల సాహిత్యం వస్తున్న మార్పు. ఏ భాష మంచిదని, ఏ భాష గొప్పదని, ఏ ప్రాంతం వాళ్లు మాట్లాడేది అసలైన ప్రామాణిక భాష అని కాదు. ఎవడు మాట్లాడితే అదే ప్రామాణికం. అందం. రాతలలో అందరి భాష తెలుస్తది. ఇట్లాంటి భాష వ్యాకరణం విషయాలలో 'ఉపకారి'ని వెలువరించిన బూర్ల వెంకటేశ్వర్లు కు అభినందనలు, నిజానికి బూర్ల వెంకన్న ప్రధానంగా ఇప్పటికే వాకిలి, రంగులవాళ్లు, పెద్ద కచ్చురం, బాయి గిర్కమీద ఊరవిష్క, రెండు పక్షుల జీవితం, ప్రాణగంథం ఆరు సంపుటాలు రాసి ఖ్యాతి పొందారు.
తెలుగు భాషకు మరొక పేరే తెలంగాణ అని బూర్ల వేంకటేశ్వర్లు ఢంకా బజాయించి చెబుతున్నారు. ఇది ఎట్లా వచ్చిందోనని సాధారణంగా వివరిస్తున్నారు. కన్నడ తమిళ వాంగ్మయాలలో తెలుగు ప్రజల గురించి చెప్పేటప్పుడు తెలంగ, తెలుంగు, శబ్దాలు ఉపయోగించారని అట్లాగే తమిళంలో తెలుంగన్ అంటే తెలుగు ప్రాంతమని, అట్లాగే కన్నడంలో తెలుగ, తెనుగు, తెలుగు, తెలుగు బాస, తెలుంగింతి అనే ప్రయోగాలున్నాయని గంటిజోగి సోమయాజులును ఉటంకించి చెప్పారు. తెలంగాణ భాష సొగసైనదని అర్థమయినదని నాధ మాధుర్యం గలదని బూర్ల వేంకటేశ్వర్లు ఇటీవలనే విడుదల చేసిన తన ఉపకారి అనే తెలంగాణ భాషాను శీలక వ్యాసాల పుస్తకం లో చాలా వరకు వివరించారు.
నాటి నుంచే ఆ పదాలు
తెలుగు భాషకు ఆంధ్ర భాష అనే మరో పేరు ఉన్నట్లుగానే, తెలంగాణ భాష అని పిలుచుకోవచ్చు. ఎందుకంటే లిపి అంతా ఒక్కటే అని, తెలుగు తెలంగాణం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడిచిన కాలంలో నీళ్లు, నిధులు, నియమాకాలలో అన్యాయం జరిగినట్లు తెలంగాణ భాష పట్ల కూడా వివక్ష జరిగిందని కవులు రచయితలు పలు చోట్ల నిరూపించిండ్రు. తెలంగాణ ప్రాంతంలో మాట్లాడేది యాస కాదు భాష అని మొత్తుకున్నరు. ప్రత్యేకంగా ప్రామాణిక భాష అనేది ఏదీ ఉండది. ఎవరి ప్రాంతంలో మాట్లాడేది వాళ్ల ప్రామాణిక భాష.
అంతేకానీ, కాళోజీ అన్నట్లు రెండున్నర జిల్లాలలో కొందరు మాట్లాడేదే ప్రమాణం అని లేదు. కాకపోతే, అక్కడి ప్రాంతం వాళ్లు పాఠ్యపుస్తకాలలో, పత్రికలలో, సినిమాలలలో, రేడియోలో, ప్రభుత్వం రాత పూతలలో ఉంటే వాళ్లు రాసిందే భాష కాదు. అదే అసలు, 'మిగితావి మాండలికాలు' అనే పేరుతో చిన్నచూపు సరైనది కాదు. అందరికీ కలిపి ఒక లిపిలో ఉన్న భాష, పదాలు వేరు వేరు ఉండవచ్చు సంస్కృతంలో, ఇంగ్లిష్ లో ఎన్నిటికో రెండు మూడు పేర్లు ఉన్నయి. అట్లనే అన్ని ప్రాంతాల భాషకు అన్నింటి వాళ్ల వాళ్ల ప్రాంతీయతతో నే రాస్తే తెలుగులో పద వికృతి ఎక్కువ అవుతుంది. తెలుగు భాషా సొగసు కూడా మరింత ఇనుమడిస్తుంది.
ప్రజల భాషకు పట్టం
బూర్ల వేంకటేశ్వర్లు వెలువరించిన ఈ భాషా వ్యాసాల పుస్తకంలో 23 వ్యాసాలు ఉన్నాయి. కరీంనగర్ నుంచే బసవపురాణం పద ప్రయోగ సూచిక డా. నలిమెల భాస్కర్ ఆధ్వర్యంలో వెలువడింది. సోమన్న బసవ పురాణ గ్రంథంలో తెలంగాణ ప్రాంతంలో వాడే పదాలు ఎన్ని ఉన్నాయో చెప్పారు. ఎనిమిది పుట్ల అడ్లు, కుంచాలు, నా, నీకు, నువ్వు, కూడలి సంగయ్య, కుమ్మర గుండయ్య, కోట కోటయ్య, శివరాత్రి సంగయ్యలాంటి ఇప్పటి పేర్లూ ఉన్నాయన్నారు. అట్లనే మహిళలకు గగ్గవ్వ, అమ్మవ్వ, సలకవ్వ, నిమ్మవ్వ, శాంతవ్వ, విమలవ్వ లాంటి పాత్రలు ఉన్నట్లు 'బసవ పురాణంలో ప్రజల భాష' అనే వ్యాసంలో పేర్కొన్నారు. అట్లాగే నిఘంటు త్రయం అనే వ్యాసంలో ప్రజల భాషలోకి వచ్చిన నిఘంటువుల గూర్చి ప్రస్తావించారు.
ఇపుడు కొంత గౌరవమే
తెలంగాణ భాష ఒకప్పుడు సినిమాలలోకి ఎక్కిరియ్య బడ్డది. కానీ, ఇప్పుడు లేదు. ఒక గౌరవంగానే ఉన్నది. సినిమాలలో డాక్యూమెంటరీలలో తెలంగాణ భాష మాట్లాడే సొగసైన పాత్రలను పెడుతున్నరు. పాటలు కూడా వస్తున్నాయి. ఇదంతా భాష పట్ల సాహిత్యం వస్తున్న మార్పు. ఏ భాష మంచిదని, ఏ భాష గొప్పదని, ఏ ప్రాంతం వాళ్లు మాట్లాడేది అసలైన ప్రామాణిక భాష అని కాదు. ఎవడు మాట్లాడితే అదే ప్రామాణికం. అందం. రాతలలో అందరి భాష తెలుస్తది.
ఇట్లాంటి భాష వ్యాకరణం విషయాలలో 'ఉపకారి'ని వెలువరించిన బూర్ల వెంకటేశ్వర్లు కు అభినందనలు, నిజానికి బూర్ల వెంకన్న ప్రధానంగా ఇప్పటికే వాకిలి, రంగులవాళ్లు, పెద్ద కచ్చురం, బాయి గిర్కమీద ఊరవిష్క, రెండు పక్షుల జీవితం, ప్రాణగంథం ఆరు సంపుటాలు రాసి ఖ్యాతి పొందారు. ఇప్పుడు భాషానుశీలనంలో వెలువడిన తెలుగు భాషా పండితులు చదవాల్సిన పుస్తకం ఇది. 128 పేజీల ఈ పుస్తకం ధర 150 రూపాయలు. ప్రతులకు రచయిత బూర్ల వెంకటేశ్వర్లు, ఫ్లాట్ నెంబర్ 403, వెంకటేశ్వర టవర్స్, జ్యోతి నగర్, కరీంనగర్,
94915 98040 నంబరులో సంప్రదించవచ్చు.
అన్నవరం దేవేందర్
94407 63479
Also Read...