- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతరంగం: అహం అన్ని రోగాలకు మూలం
నేనే అధికం అనే భావన వ్యాపించి కుటుంబాలలోనూ ప్రవేశించింది. దీంతో మానవ సంబంధాల పట్ల మనుషుల తీరు పట్ల ఆహ్వానించకూడని మార్పులు వస్తున్నాయి. అన్నింటికి మించి మనుషులందరికి ప్రేమ, సహనం, క్షమించే గుణం, అందరి పట్ల ఉందారత్వం ఉండాల్సిన రోజులు రావాలి. ఇవన్నిటి ఒత్తిడితోనే మానసిక వ్యాధులు, రుగ్మతలు వ్యాపించడం. వాటికోసం ఆసుపత్రులకు మందులకు పోతే, అక్కడొక మాయాలోకం చిన్న రోగాన్ని పెద్దదిగా చూపి మంచి వ్యాపారం చేయడం. అవసరం లేని పరీక్షలు నిర్వహించడం కొనసాగుతుంది. లేని రోగాలకు మందులు వాడటం వాటికి సైడ్ ఎఫెక్ట్‌లు. ఇట్లా ఒకదానితో ఒకటి ముడి పడి సాగుతుంది.
అహాన్ని కిరీటం చేసికొని జీవించాలనుకునే వారికి ప్రశాంతత కన్పించదు. ఎప్పుడూ ఆ అహాన్ని మెయింటెన్ చేస్తుండాలి. 'నేను గొప్ప, నేనే గొప్ప, నాచే ఈ ప్రపంచం నడుస్తుంది' అనుకునేవాళ్లకు ఎవ్వరూ ఏమి చేయరు. అహం స్థానంలో ఆత్మగౌరవం నిండి ఉండాలి. అహం నిండినవారి కార్యక్షేత్రంలో నిరంతరం మెదిలేవారికి కొంచెం కష్టమే. వీళ్లకు ఆత్మగౌరవ సమస్య. అహంకారం ఆత్మగౌరవాల మధ్య మమకారం నలిగిపోతది. ప్రేమ కరుణ అనురాగం నిండి ఉండాలి. ఒక రాజకీయ పార్టీ నాయకునికైనా, ఒక ఉన్నతాధికారికైనా ఏదైనా ఒక యజమానికైనా తోటివాళ్లతో 'అంతా నేనే' సంబంధాల కంటే 'అంతా మనమే' భావన కొనసాగితే ఆ కార్యక్షేత్రం పరిఢవిల్లుతది. లేకుంటే లుకలుకలు తయారైతయి. లుకలుకలు సర్దుకునేందుకు, అహం కిరీటం కించపడకుండా కాపాడుకునేందుకే జీవితం కరిగిపోవచ్చు.
సమానమనే భావన ఉండాలి
అసలు మనుషుల మధ్య ఎక్కువ తక్కువ అధికం గొప్ప అనే భావన కన్నా అంతా సమానం అనే ఊహ ముందు నుంచి ఉండాలి. తరగతి గదిలో పని ప్రదేశంలో పనిచేస్తున్న సంఘం సంస్థలో ఉద్యోగవర్గంలో ఆఖరుకు కుటుంబంలో కూడా ఇగోనే గ్యాప్ సృష్టిస్తది. ఇతరుల పలకరింపు నుంచే మొదలవుతుంది. చూసే చూపు ఇచ్చిపుచ్చుకోవడం నుంచి అంతర్లీనంగా కొనసాగుతది. అయితే ఎవరి అహం వారికే ఉంటది అనుకోవచ్చు. మానవుడు సంఘజీవి. తెల్లారి లేస్తే మనుషులు సంబంధాలు ఉంటాయి. అన్ని చోట్ల ఈ సమస్య కన్పించి తలబిరుసుతనం తేటతెల్లం చేస్తాయి. ఎక్కువ తక్కువ అనే భావనలు వర్ణ వ్యవస్థ నుంచే పుట్టాయి. గొప్పవారు తక్కువ వారు అనే వాతావరణం అటు తర్వాత కలోనియల్ రూల్ వల్ల కూడా దేశంలో హైరార్కీ వ్యవస్థ తయారైంది.
అన్నిటి అసరు మనుషుల మీద పడి మనుషుల మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. కొంతమంది మనుషుల వ్యక్తిత్వం చూడముచ్చటగా ఉంటుంది. స్నేహం చెయ్యాలన్నంత ప్రేమ ఉంటుంది. అయితే, అందరూ అలా ఉండరు. లోకం మీద మంచి వాళ్లు తక్కువ ఉంటరు. నిజానికి మంచివాళ్లు ఎక్కువ ఉంటే చెడువాళ్లు తగ్గిపోతరు. ఒక సమూహంలో చెడ్డవాళ్లు తక్కువ మంది మంచివాళ్లు ఎక్కువ మంది ఉంటే అంతా మంచి జరుగుతది. క్రమంగా మంచి ప్రచారం అయి చెడు తలుపులు వేసుకుని లోపలికి పోతది.
అలా అయితే రివ్యూ చేసుకుంటారు
అయితే, మంచిని మంచి అని చెడు అని స్పష్టంగా చెప్పగలిగే ఉండాలి. ఇది తప్పు అనే వాళ్లు ఉన్నప్పుడే ఇతరులకు మార్చుకునేందుకు, వాళ్లు రివ్యూ చేసుకునేందుకు ఉపయోగపడవచ్చు. ఎక్కడ తప్పు అయినా నాకెందుకు లే! అనే నిర్లిప్త భావన వ్యాపిస్తే అదే నిజమని చలామణి అయిపోతది. ఇప్పుడు రాజకీయ పార్టీలలో, ప్రభుత్వాలలో, సంఘాలలో, సంస్థలలో, ప్రభుత్వ యంత్రాగంలో దాదాపు అలాగే తయారైంది. అయితే అన్నింటికి ఆర్థిక దన్ను నాకేమి వస్తుందనే లాభాపేక్ష స్వార్థం ఎక్కువ అవడం వలన ఇలా వ్యవస్థ దాపురించింది.
బంధాలు నేర్పే సిస్టం ఉందా?
విద్యార్థులలో మంచి విషయాలు, మానవ సంబంధాలు, కురిపించాల్సిన ప్రేమ, అనురాగం గూర్చి తరగతులు లేవు. ఇట్లాంటి విషయాలు నేర్పే సిస్టం కూడా ఎక్కడా లేదు. ఏమైనా అత్యధిక మార్కులు స్కోర్ చేయించడం అధిక మొత్తంలో వేతనాలకు పనులు చేయడం పైసలు సంపాదించడం తప్పితే ఇంకేం లేదు. ఐదో తరగతి నుంచి ఐఐటీ గూర్చి ప్రత్యేక క్లాసులు ఉంటే ఎట్లా తయారైతరు? మంచి పైసలు సంపాదించేవాళ్లుగా తయారైతరు. సరిగ్గా ఇట్లాంటి తరం ప్రపంచీకరణ ప్రారంభం అయిన 90వ దశకం నుంచే వచ్చింది.
అంతా 'పైసలు చుట్టే వైకుంఠం' అన్నట్టుగా తయారైంది. దీంతో బిరుసుతనం ఇగో స్టేటస్ మెయింటెన్ చేయడం, నేనే అధికం అనే భావన వ్యాపించి కుటుంబాలలోనూ ప్రవేశించింది. దీంతో మానవ సంబంధాల పట్ల మనుషుల తీరు పట్ల ఆహ్వానించకూడని మార్పులు వస్తున్నాయి. అన్నింటికి మించి మనుషులందరికి ప్రేమ, సహనం, క్షమించే గుణం, అందరి పట్ల ఉందారత్వం ఉండాల్సిన రోజులు రావాలి. ఇవన్నిటి ఒత్తిడితోనే మానసిక వ్యాధులు, రుగ్మతలు వ్యాపించడం. వాటికోసం ఆసుపత్రులకు మందులకు పోతే, అక్కడొక మాయాలోకం చిన్న రోగాన్ని పెద్దదిగా చూపి మంచి వ్యాపారం చేయడం. అవసరం లేని పరీక్షలు నిర్వహించడం కొనసాగుతుంది. లేని రోగాలకు మందులు వాడటం వాటికి సైడ్ ఎఫెక్ట్‌లు. ఇట్లా ఒకదానితో ఒకటి ముడి పడి సాగుతుంది.
అన్నవరం దేవేందర్
94407 63479