- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుపై రాజకీయమా?
ఈనాడందరూ రైతురాగమెత్తుకుంటున్నరు
అధికార అందలాలు చేజారకుండ
వడ్లు కొనేందుకు దుడ్లు లేవని
రైతు స్వేదాన్ని కడుపారా నింపుకొని
ఉద్దరిస్తామని ఉద్దెరమాటలతో కాలయాపన
ధర్నాలతో మాటల పోటీలు
పైనోడిమీద కిందోడు
కిందోడిపైన పైనోడు
బురదజల్లుకుంటూ కుళ్లు రాజకీయాల్జేస్తున్నరు
వడ్ల పేరుజెప్పి ఓట్లు కొన్నట్లున్నది బేరం
మెత్తని కుర్సిల కూసోని
చల్లని గదులల్లా అలవాటవడ్డోళ్లు
చెమటసుక్కల సేద్యానికి
చిందించే స్వేదానికి విలువతగ్గచ్చి విర్రవీగుతుండ్రు
ఉడుకుడుకు వండిపెట్టినామే
కాదిక్కడ ముఖ్యం
ఊదుకు తిను అన్నమె గొప్పదైనట్టుంది అడ్డగోలు వరిరాజకీయం
కష్టానికంతా నష్టం జేసేటోల్లే
పాలకులారా జనం కోసం కదలండి
శాశ్వతంకాదు మీరనుభవించే అధికారం
దిక్కార గళాలన్నేకమై తూర్పారబట్టేందుకు సిద్ధమైతున్నయ్
గమనిస్తున్నది కుతంత్రాలన్నీ
మాయమాటల కోటలనన్నీ
కూకటివేళ్లతో పెకిలించేందుకు
ప్రజలు వెర్రోలనుకుంటున్నరా
కర్రు కాల్చుతున్నరు
కీలెరిగి వాతెట్టేందుకు
తస్మాత్ జాగ్రత్త!!
సి. శేఖర్ (సీఎస్‌ఆర్)
పాలమూరు, 9010480557
- Tags
- Poetry