- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రిపుల్ ఐటీ ప్రవేశాల జాబితా విడుదల
దిశ, బాసర : రాజీవ్ గాంధీ సాంకేతిక విద్యాలయం బాసర ట్రిపుల్ ఐటిలో 2021–22 విద్యా సంవత్సరానికి ప్రవేశాల జాబితాను అధికారులు గురువారం విడుదల చేశారు. ఈ సంవత్సరం పాలిసెట్ విధానం ద్వారా ప్రవేశం కోసం ఎంపికైన విద్యార్థుల మొదటి దశ ప్రవేశ జాబితాను కళాశాల ఏవో రాజేశ్వర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులకు మొత్తం 20,195 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఇందులో స్థానిక విద్యార్థుల నుంచి 19,269 స్థానికేతర 221, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన వారు 11,215, ప్రైవేటు పాఠశాలలకు చెందిన వారు 8275, ఇతర రాష్ట్రాలు, గ్లోబల్ సీట్ల కు 25 దరఖాస్తులు అందాయని తెలిపారు.
మొత్తం సీట్లలో 15% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు, మిగిలిన 85% సీట్లు తెలంగాణకు చెందిన స్థానిక విద్యార్థులకు కేటాయించబడినవి. ఎంపికైన విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు అందరూ తప్పనిసరిగా కావలసిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్ కు నిర్దేశించిన తేదీ నాడు హాజరుకావాలని, కౌన్సిలింగ్ కు హాజరు కాని విద్యార్థులు ప్రవేశం పొందే అవకాశం కోల్పోతారని అధికారులు తెలిపారు.