- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సింగరేణి క్వార్టర్స్‌లో మద్యం అమ్మకాలు.. పట్టించుకోని అధికారులు..!
దిశ, గోదావరిఖని: సింగరేణికి సంబంధించిన క్వార్టర్స్‌లో అక్రమ నిర్మాణాలు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ.. కొంతమంది మాత్రం పెడచెవిన పెడుతున్నారు. ఈ కార్యక్రమాలకు కిందిస్థాయి అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న గుడిసె వేసుకుంటేనే కూల్చివేసే అధికారులకు సింగరేణి క్వార్టర్స్‌లో మద్యం అమ్ముతున్నా కనబడటం లేదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గోదావరిఖని పరిధి విఠల్‌నగర్‌లోని సింగరేణి క్వార్టర్స్‌లో 24 గంటలు మద్యం అమ్మకాలు జరుగుతున్నా కనీసం అధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే క్వార్టర్స్‌లలో జరుగుతున్న కార్యక్రమాలపై ఏరియా మొత్తం కోడై కూస్తున్నా.. అధికారుల దృష్టికి వెళ్లకపోవడం వెనక ఆంతర్యమేమిటో అన్న సందేహాలు పలువురు కార్మికుల్లో నెలకొంటున్నాయి. చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటేనే వాటిని కూలగొట్టిన అధికారులకు బహిరంగంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా.. వాటిపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఎవరి హస్తం ఉందన్న ప్రచారం స్థానిక కార్మికుల్లో నెలకొంది. ఇప్పటికైనా దీనిపై సింగరేణి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.