అక్రమంగా లిక్కర్ సిండికేట్.. ఒకే కాంప్లెక్స్ లో..

by Shyam |   ( Updated:2021-12-11 02:47:50.0  )
అక్రమంగా లిక్కర్ సిండికేట్.. ఒకే కాంప్లెక్స్ లో..
X

దిశ ఏటూరు నాగారం: ప్రభుత్వం విధించిన నిబంధనలను బ్రాందీ షాపు యజమానులు పాతరేసి మద్యాన్ని అమ్ముతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏటూరునాగారం లో ఈఎన్ఆర్ వైన్ షాప్, భవాని వైన్స్ షాప్, మహేష్ వైన్స్, అని 3 షాపులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే నిబంధనల ప్రకారం బ్రాందీ షాప్ లను దూరదూరంగా ఏర్పాటు చేయాలి. కానీ షాపు యజమానులు మాత్రం ఒకే కాంప్లెక్స్ లో మూడు షాపులను ఏర్పాటు చేశారు.

మద్యాన్ని ఎమ్ఆర్పి రేట్లకు మించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని మందు బాబులు అంటున్నారు. అధికారుల అండదండలతో మద్యాన్ని బెల్టు షాపులకు విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. షాపు యజమానులు సిండికేట్లు గా మారి ఒకే కాంప్లెక్స్ లో మూడు షాపులు కొనసాగుతున్నట్లు, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మండలంలోని రామ్ నగర్ కు మరొక షాప్ ను ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అయితే ఆ షాప్ నుంచే పక్కన ఉన్న మంగపేట మండలం లోని బెల్టు షాపులకు మద్యాన్ని తరలిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలను షాపు యజమానులు పాటించడం లేదు. మాస్కులు, భౌతిక దూరం పాటించకుండా, మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story