- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందూరులో..జోరుగా మద్యం అమ్మకాలు
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో మద్యం అమ్మకాలపై లాక్ డౌన్ ప్రభావం కనిపించడం లేదు. అధికారికంగా మద్యం దుకాణాలకు తాళాలు పడ్డాయి. కాని ప్రతి ఏరియా, గ్రామంలో అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయి. అయితే, ఈ అమ్మకాల్లో ప్రభుత్వానికి పన్ను చెల్లించని(నాన్ డ్యూటి పేయిడ్) మద్యమే ఉన్నట్టు తెలుస్తోంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మూడు అంతరాష్ర్ట సరిహద్దులు ఉన్నాయి. అక్కడి నుంచి తీసుకువచ్చిన మద్యాన్నే నిలువ పెట్టి బెల్ట్ షాపుల్లో గతంలో అమ్మారు. ఇప్పుడు అలాగే సాగుతున్నట్టు సమాచారం. వారం రోజులుగా లాక్ డౌన్ ఉంది. అయినా మద్యం అమ్మకాలు ఆగడం లేదు. లాక్ డౌన్ ఉన్నా మొదటి మూడు రోజులు అనాధికారికంగా కొన్ని వైన్స్, బార్లను తెరిచి మద్యాన్ని తరలించి బ్లాక్ అమ్మకాలు చేశారు. తర్వాత రహస్య ప్రాంతాల్లో మద్యం వ్యాపారులు నిల్వ చేసిన ఎన్‌డిపి మద్యాన్ని అమ్ముతున్నట్టు తెలుస్తోంది.
అమ్మకాల్లో రాజధాని తర్వాత..
మద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ర్టంలో రాజధాని హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ జిల్లానే టాప్. ఉమ్మడి జిల్లాలో సాధారణంగా ప్రతి విందు మందుతోనే ముగుస్తుంది. సంతోషం, దుఖంలో మద్యానికి స్థానం ఉంది. వేసవిలో జరిగే బీర్ల అమ్మకాలలో తెలంగాణలో నిజామాబాద్ నెం.1 స్థానం. అయితే, ఇక్కడ అబ్కారీ శాఖ నిర్లక్ష్యం వలన బెల్ట్ షాపులు చాలా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మద్యం వ్యాపారులు అధిక సంపాదన యావలో ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా ఇతర రాష్ట్రాలు హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి మద్యం తెప్పిస్తారు. వాటిని ప్రైవేటు గోదాంలలో నిల్వ చేస్తారు. ఆ తర్వాత కాలంలో ప్రభుత్వ ఐఎంఎల్ డిపోల మద్యంతో కలిపి ఈ ఎన్‌డిపి మద్యంను విక్రయిస్తారు. అయితే, ఈ విషయం అబ్కారీ శాఖకు తెలిసినా నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలూ ఉన్నాయ.
Tags : liquor consumption, lockdown, high, nizamabad district