పరిమిత సంఖ్యలో రైళ్లు… ఎంపిక చేసిన రూట్లలోనే

by  |
పరిమిత సంఖ్యలో రైళ్లు… ఎంపిక చేసిన రూట్లలోనే
X

దేశవ్యాప్తంగా కేంద్రం ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ మరో నాలుగు రోజుల్లో అనగా 14‌వ తేదీ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో 15 నుంచి రైళ్లను తిప్పేందుకు రైల్వేశాఖ కసరత్తు ప్రారంభించింది. లాక్‌డౌన్‌ను పొడిగించేందుకు కేంద్రం మొగ్గు చూపవచ్చని అందరూ భావిస్తుండటంతో పరిమిత సంఖ్యలో, అది కూడా ఎంపిక చేసిన రూట్లలోనే రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం రైల్వే బోర్డు చైర్మన్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

రైళ్లో నాన్ ఏసీ, స్లీపర్ క్లాస్ బోగీలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఎక్కువగా నాన్ స్టాఫ్ రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. రైళ్లో ప్రయాణించాలకునే వారు కనీసం 12 గంటల ముందు ఆరోగ్యపరిస్థితిపై అధికారులకు సమాచారం ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది. బెర్త్ కన్‌ఫాం అయిన వారికి మాత్రమే ప్రయాణం చేసేందుకు వీలుంటుంది. రైల్వే స్టేషన్‌కు కనీసం నాలుగు గంటల ముందు చేరుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణికులు థర్మల్ స్క్రీనింగ్ చేయించుకున్న తరువాతే రైళ్లలోకి వెళ్లాలి. బోగీలో కేవలం ఇద్దరు ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. లాక్ డౌన్ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని గమ్య స్థానాలకు చేర్చడం కోసమే పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ తెలిపారు.

Tags: train, railway board chairman, lock down

Advertisement

Next Story