ప్రజా రవాణాను పునరుద్ధరించాలి – కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్

by vinod kumar |
ప్రజా రవాణాను పునరుద్ధరించాలి – కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్
X

న్యూఢిల్లీ: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా రవాణాను పరిమితంగానైనా పునరుద్ధరించాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వలస కూలీల కోసం ఈ నిర్ణయాన్ని పరిగణించాలని తెలిపారు. విమానాలు, రైళ్లు, బస్సుల రాకపోకలను పాక్షికంగానైనా ప్రారంభించాలని సూచించారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆయన స్పందిస్తూ.. ఈ దుర్ఘటన తీవ్రంగా బాధించిందని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజా రవాణాను ముఖ్యంగా వలస కూలీల కోసమైన ప్రారంభించాలని పేర్కొన్నారు.

Advertisement

Next Story