తెలుగు ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేత

by srinivas |
Government of Delhi
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల ప్రయాణికులపై విధించిన ఆంక్షలను ఢిల్లీ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. గతంలో తెలంగాణ, ఏపీలో కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న సమయంలో ఢిల్లీ ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. రోడ్డు, రైలు, విమానం ఇలా ఏ మార్గంలోనైనా ఢిల్లీకి వచ్చే ప్రయాణికులు RT-PCR నెగటివ్ రిపోర్టు తేవాలని మే 6న కేజ్రీవాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని వెంటనే అమలు చేయాలని జిల్లా కలెక్టర్లతోపాటు ఆయా విభాగాలకు ఆదేశాలు ఇచ్చింది.

తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీ ప్రభుత్వం గతంలో విధించిన ఆంక్షలను ఉపసంహరించుకుంది. వాటితోపాటు నెగిటివ్ రిపోర్ట్ లేకుంటే 14 రోజుల క్వారంటైన్ ఉండాలనే నిబంధనను కూడా సడలించింది. దీంతో ఏపీ, తెలంగాణ నుంచి వెళ్లే ప్రయాణికులు సాధారణ ప్రయాణాలు చేయడానికి సులభతరం అయింది.

Advertisement

Next Story

Most Viewed