- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒకేసారి 100 పచ్చి గుడ్లను తాగిన యూట్యూబర్.. ఎందుకో తెలిస్తే షాక్(వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. గుడ్లు ప్రతిరోజూ తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. మెదడు చురుగ్గా పనిచేయడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, మెదడులోని కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యంగా గుడ్డు ఎంతగానో ఉండడానికి సహకరిస్తుంది. పిల్లలు ఎదగడంలో తోడ్పడుతుంది. ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది. అందుకే కొందరు రోజూ ఉడికించిన గుడ్డును తీసుకుంటారు. మరికొందరు మాత్రం పచ్చి గుడ్డును తాగుతుంటారు. పచ్చి గుడ్డును తాగడం కొంత కష్టమే అయినప్పటికీ వ్యాయామం చేసేవారు తప్పక తీసుకుంటుంటారు.
అయితే, ఒక్క గుడ్డు తాగడానికే చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. కానీ ఓ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్యూయెన్సర్ మాత్రం ఏకంగా 100 పచ్చి గుడ్లను ఒకేసారి తాగి సోషల్ మీడియాలోని జనాలను ఆశ్చర్యపరిచాడు. విన్స్ ఇయానోన్ అనే యూట్యూబర్ తనకు లక్ష ఫాలోవర్స్ వచ్చినందుకు వంద పచ్చి గుడ్డను ఒకేసారి తాగాడు. జిమ్ సెంటర్‌లోనే నిలబడి ఓ పెద్ద మగ్గు నిండా పచ్చిగుడ్లను నింపుకున్నాడు. ఎందుకిలా చేస్తున్నాడో వివరిస్తూ.. మగ్‌లోని గుడ్డు మిశ్రమాన్ని తాగడం మొదలుపెట్టాడు. సగం తాగినాక కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ తాగడం ప్రారంభించాడు. తర్వాత మగ్‌ను పక్కకు పెట్టి నాలుగు పుషప్స్ చేశాడు. అనంతరం మళ్లీ తాగడం కొనసాగించాడు. ఇలా మగ్‌లోని మొత్తం గుడ్డు మిశ్రమాన్ని కంప్లీట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.