జిమ్ చేసే యువకులు ఎక్కువగా హార్ట్‌ఎటాక్ బారిన పడటానికి కారణం ఇదే!

by Anjali |
జిమ్ చేసే యువకులు ఎక్కువగా హార్ట్‌ఎటాక్ బారిన పడటానికి కారణం ఇదే!
X

దిశ, ఫీచర్స్: పదిహేను నుంచి పాతికేళ్ల వయసు చాలా కీలకమైన దశ. ఈ ఏజ్ లో అందానికి గానీ ఆరోగ్యం పట్ల గానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం మన దైనందిక జీవితంలో జిమ్ అనేది చాలా ముఖ్యం. వ్యాయామం మన హెల్త్ కే కాదు అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కేవలం బరువు ఎక్కువగా ఉన్నవారే కాదు సన్నగా ఉన్నవారు కూడా జిమ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందొచ్చు. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఫీల్‌ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి.

మృతకణాలు పేరుకోకుండా ఉంటాయి. చర్మం ఫ్రెష్‌గా మారుతుంది. చిన్న వయసు నుంచే వ్యాయామం చేయడం వల్ల ఫ్యూచర్‌లో మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. శరీరపు బరువును నియంత్రించడానికి, కండరాలను స్ట్రాంగ్‌గా, శక్తివంతంగా ఉంచడానికి, ఎముకలను బలంగా తయారు చేయడానికి, ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడానికి తోడ్పడుతుంది. ప్రతి రోజూ జిమ్ చేయడం వల్ల స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, నిద్రలేమి, మానసిక రోగాల వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారించవచ్చును.

అయితే ఇటీవల జిమ్ చేసే యువకులు తరచుగా హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. దీంతో చాలా మంది భయపడి వ్యాయామం చేయడమే మానేశారు. తాజాగా దీనిపై వైద్య నిపుణులు ఆశ్చర్యకరమై విషయాలు తెలిపారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

తరచూ జిమ్‌కు వెళ్లి కఠిన వ్యాయామాలు చేసేవారు ముందుగా వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. శరీరంలో ఉన్న రోగాలను నిర్ధారణ చేసుకోకుండా జిమ్ కు వెళ్లి కసరత్తులు చేస్తున్నందున హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారని నిపుణులు వెల్లడిస్తున్నారు. కఠిన వ్యాయామాలు చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది కానీ బాడీలో ఉన్న అడ్డంకుల వల్ల గుండెపోటు వస్తుందంటున్నారు.

ముఖ్యంగా ఎక్కువగా వర్కౌట్స్ చేసే వారు కోచ్ ల సలహాలు తప్పనిసరిగా పాటించాలి. గుండె రక్తనాళాల్లో చీలిక కనుక ఏర్పడితే ఎలాంటి వారికైనా గుండెపోటు వస్తుందంటున్నారు. ఆరోగ్యం సహకరించినప్పుడే జిమ్ చేయడం కాదు.. మీ శరీరానికి ఏదైతే సెట్ అవుతుందో అలాంటి వ్యాయామాలు మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్, బీపీ వంటి వ్యాధులతో బాధపడేవారు జిమ్ జోలికి అస్సలు వెళ్లకూడదంటున్నారు వైద్య నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed