Parenting : పిల్లల్ని పెంచడం ఎలా ..? సోషల్ మీడియాపై డిపెండ్ అవుతన్న యంగ్ పేరెంట్స్

by Javid Pasha |   ( Updated:2024-12-17 15:37:43.0  )
Parenting : పిల్లల్ని పెంచడం ఎలా ..? సోషల్ మీడియాపై డిపెండ్ అవుతన్న యంగ్ పేరెంట్స్
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. కాగా కొన్ని విషయాల్లో తమ పిల్లలను ఎలా గైడ్ చేయాలి? వారికి సంబంధించిన ట్రెండ్స్ ఏంటి? అనే విషయాలపట్ల అవగాహన కోసం ఈతరం తల్లిదండ్రులు ఎక్కువగా సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. ప్రతీ 10 మంది ఆరుగురు యంగ్ పేరెంట్స్‌ పిల్లల గైడెన్స్‌కు సంబంధించిన అంశాలను సోషల్ మీడియాలో వెతుకుతున్నారని డిపెండ్ అవుతున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆ వివరాలేంటో చూద్దాం.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కొత్తగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో అనుమానాలు ఉంటే పెద్దలను, అనుభవజ్ఞులను అడిగి తెలుసుకునేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఉమ్మడి కుటుంబాలు చాలా వరకు కనుగమరుగవుతున్నాయి. ఉద్యోగాలకోసమో, ఉపాధి కోసమో చాలా మంది నగరాలకు వస్తున్నారు. ఒకవేళ కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులున్నా చదువుకున్న యువ జంటలు ఉద్యోగాల కోసం వారికి దూరంగా నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ట్రెండ్ చిన్న పిల్లల తల్లిదండ్రులకు వాల్యూబుల్ రిసోర్స్‌గా మారుతోంది.

ఎంతోమంది యంగ్ పేరెంట్స్ ‘నావెల్ పేరెంటింగ్ స్ట్రాటజీస్’ను కనుగొనడానికి సోషల్ మీడియా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నట్లు మిచిగాన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. స్టడీలో భాగంగా వీరు కనీసం ఐదేండ్ల కంటే తక్కువ వయస్సు పిల్లలు కలిగిన 614 మంది పేరెంట్స్‌ను సర్వే చేశారు. ముఖ్యంగా మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది తల్లులు సోషల్ మీడియా వేదికగా తమ పేరెంటింగ్ అనుభవాలను షేర్ చేసుకోవడం, సలహాలు పొందడం చేస్తున్నారని తేలింది. ఇక సోషల్ మీడియాలో యంగ్ పేరెంట్స్ చేసే డిస్కషన్ విషయానికి వస్తే టాయిలెట్ ట్రెయినింగ్, స్లీప్ హాబిట్స్, న్యూట్రిషన్, బ్రెస్ట్ ఫీడింగ్, నిద్ర అలవాట్లు, క్రమశిక్షణ, బిహేవియరల్ ఇష్యూస్, వ్యాక్సినేషన్స్, డేకేర్, ప్రీస్కూల్ అండ్ సోషల్ ఇంటరాక్షన్స్ వంటి అంశాలు కామన్ టాపిక్‌గా ఉంటున్నాయి.

Read More...

Trending : ఆలోచనల్లో మార్పు.. 2025లో Gen Z థాట్స్ ఇవే..!


Advertisement

Next Story

Most Viewed