ముసలోడితో అమ్మాయి పెళ్లి.. చివరకు షాకింగ్ ట్విస్ట్.. వీడియో వైరల్

by Sujitha Rachapalli |   ( Updated:2024-05-02 12:19:19.0  )
ముసలోడితో అమ్మాయి పెళ్లి.. చివరకు షాకింగ్ ట్విస్ట్.. వీడియో వైరల్
X

దిశ, ఫీచర్స్: ఈ మధ్య పెళ్లి న్యూస్ వింటేనే షాక్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. 18ఏళ్ల కుర్రాడు 60 ఏళ్ల వృద్ధురాలిని.. 20ఏళ్ల అమ్మాయి 50ఏళ్ల అంకుల్ ని మ్యారేజ్ చేసుకోవడం కామన్ అయిపోయింది. పైగా ప్రేమ గుడ్డిది కదా అనే ఫిలాసఫీ చెప్పడం సాధారణం అయింది. ఇలాంటిదే ఈ స్టోరీ కూడా. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోలో అమ్మాయి పుత్తడి బొమ్మలా ఉంటే వరుడు ముసలోడు కావడం విశేషం. అయితే డబ్బు కోసమో, మరేదైనా కారణం వల్లనో ఈ పెళ్లి జరిగి ఉండొచ్చు. కానీ ఇందులో బంధువులు కూడా హ్యాపీగా ఉన్నట్లు కనిపించడం లేదు.

ఇక ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. 'అసలు అమ్మాయిలకు ఏమైంది ఇలాంటి డెసిషన్లు తీసుకుంటున్నారు', ' ఊరిలో ఉన్న అందగత్తెను చూసి సెలెక్ట్ చేసుకున్న కాక', ' అమ్మాయిలను అంగట్లో సరుకులా అమ్మేస్తున్నారు' అని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి పెళ్లిళ్లు ఆగాలని కొందరు అంటుంటే.. సెలబ్రిటీలు కూడా ఇలా చేసేసరికి ఇదంతా కామన్ అయిపోయింది అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.

Read More..

మీకు నచ్చినట్టు డ్యాన్స్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Advertisement

Next Story