ఆన్ లైన్‌ లో చింతగింజల ధర ఎంతో తెలుసా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే?

by samatah |
ఆన్ లైన్‌ లో చింతగింజల ధర ఎంతో తెలుసా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్ : పల్లెటూర్లలో చింత గింజల గుంరించి అంతగా పట్టించుకోరు. వేసవిలో ఎక్కడ చూసినా సరే చింత గింజలు కనిపిస్తూ ఉంటాయి. అంతే కాకుండా వాకిట్లో అష్ట చమ్మగీసి చింతగింజలతో ఆట ఆడుతుంటారు. అలాంటిది ఇప్పుడు ఆన్‌లైన్‌లో చింతగింజలను చూస్తే షాక్ అవ్వాల్సిందే.

ఆన్‌లైన్‌లో ప్రతి చిన్నవస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు మనకు అందుబాటులో ఉంటుంది. చివరికి పిడకలు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఏదైనా పులు కూర వండితే అందులో రెండు చింత గింజలు వేస్తే చాలా బాగుంటుంది. అంతే కాకుండా చింత గింజలను కాల్చుకొని తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటి చితంత గింజలు ఆన్‌లైన్‌లో ఒక్కో ప్యాకెట్‌కు రూ.110గా అమ్ముతున్నారు. అంతే కాకుండా అందులో కేవలం 100 చింత గింజలు మాత్రమే ఉంటాయి. ఇక ఇది చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. వామ్మో చింతగింజలకు ఇంత ధరనా అంటూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.

Advertisement

Next Story