- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లికి ముందు భార్యాభర్తల బాధ్యతలపై చర్చ అవసరం
దిశ, ఫీచర్స్: పెళ్లికి ముందు భాగస్వామితో జీవితానికి సంబంధించిన విషయాలు చర్చించాలి. నిజాయితీగా, అర్ధవంతమైన సంభాషణలు జరపాలి. ముఖ్యంగా ఎలాంటి అంశాలు పరిగణనలోకి తీసుకోవాలో చూద్దాం.
* ఆర్థిక విషయాలు
పెళ్లి చేసుకునే ముందే ఎంత జీతం ఇంటికి వస్తుంది. దేనికి ఎంత ఖర్చు అవుతుంది అని లెక్కలు వేసుకోవాలి. అప్పులు ఉంటే ముందే తీర్చుకునే ప్రయత్నం చేయాలి. ఫ్యామిలీ బడ్జెట్.. స్వల్ప కాల, దీర్ఘ కాలిక ఆర్థిక లక్ష్యాలపై చర్చించడం మంచిది. ఇల్లు నిర్మాణం, కారు కొనుగోలు, పిల్లల విద్య గురించి ఖర్చును పరిగణలోకి తీసుకోవాలి.
* హోమ్ - ఆఫీస్ వర్క్ బ్యాలెన్స్
మీది, మీ భాగస్వామి ఆఫీస్ వర్కింగ్ హవర్స్ .. ఇంటికి, కార్యాలయానికి మధ్య జర్నీకి పట్టే సమయం.. అన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటికి వచ్చాక ఎవరు ఎలాంటి పని చేయాలని నిర్ణయించుకోవాలి. ప్రతి విషయం గురించి చర్చించుకోవాలి.
* లివింగ్ అరేంజ్మెంట్స్
మీరు అత్తామామలతో కలిసి జీవించాలని అనుకుంటున్నారా? లేక వేరుగా ఉండాలనుకుంటున్నారా? అనేది ముందుగానే నిర్ణయించుకోవాలి. అందుకు అనుగుణంగా పెద్దవాళ్ళతో చర్చించాలి. అలా అయితే ముందుగానే ప్రిపేర్ అయిపోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు.
* కుటుంబంలో పాత్ర
మీరు మీ భాగస్వామి కుటుంబంతో ఎలా ఉండాలి అనుకుంటున్నారు? అత్తమామలతో ఈక్వేషన్స్... తోబుట్టువులతో బంధాలు ఎలా ఉంటాయని మాట్లాడుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ వ్యక్తిత్వం గురించి ముందే తెలిస్తే ఈజీగా సర్దుకుపోవచ్చు.
* ఆరోగ్యం
భాగస్వాములు ఇద్దరు మీ భవిష్యత్తును ప్రభావితం చేసే ఏవైనా ఆరోగ్య సమస్యలు, జన్యుపరమైన సమస్యల గురించి తెలుసుకోవాలి. తీసుకునే ఆహారం, డ్రింక్స్ తో సహా అన్నింటి గురించి చర్చించాలి. ఒకే విధమైన అలవాట్లు మెయింటైన్ చేస్తే ఇంకా మంచిది.
* గొడవకు పరిష్కారం
గొడవ జరిగినప్పుడు, జరిగాక రియాక్ట్ అయ్యే విధానం కూడా ముఖ్యమే. ప్రతిస్పందించే విధానం తెలుసుకోవడం, చర్చించడం అవసరం. కొత్త జంటకు ఈ డిస్కషన్ చాలా హెల్ప్ అవుతుంది.
* మతపరమైన విశ్వాసాలు
ఒకే విధమైన మతపరమైన విశ్వాసాలు బంధం బలపడేందుకు కారణం అవుతాయి. ఒకవేళ వేరు వేరు మతాలను అనుసరించినా.. ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఈ పద్ధతి దీర్ఘకాలం ఆ బంధాన్ని ప్రభావితం చేస్తుంది.
* ఫ్రెండ్ షిప్స్
ప్రజెంట్ సొసైటీ కల్చర్ మారింది. స్నేహితులు కీలకపాత్ర పోషిస్తున్నారు. పెళ్లికి ముందు చాలా మందితో ఫ్రెండ్షిప్ ఉంటుంది. అమ్మాయి, అబ్బాయిలు స్నేహంలో ఉంటారు. దీని గురించి ముందే అర్థం చేసుకుంటే.. లైఫ్ లో ఎలాంటి గొడవలు ఉండవు.