భార్య, భర్తల మధ్య చిచ్చు పెడుతున్న సెల్ ఫొన్.. ఎలానో తెలుసా?

by samatah |   ( Updated:2023-08-12 14:01:02.0  )
భార్య, భర్తల మధ్య చిచ్చు పెడుతున్న సెల్ ఫొన్.. ఎలానో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం మొబైల్ ఫోన్ మనిషి జీవితంలో భాగమైపోయింది. దీని మాయలో పడి చాలా మంది, తమ కుటుంబసభ్యులను పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన దంపతుల మధ్య గొడవలకు మొబైల్ ముఖ్య కారణం అవుతుంది. అయితే మొబైల్ ఫోన్ల కారణంగా పార్టనర్స్ మధ్య గొడవలు జరిగితే దానిని ఫబ్బింగ్గ్ అంటారు. దీని వలన శృంగార జీవితంలో సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా వస్తాయంట.

ఫొన్ ఎక్కువగా చూస్తూ తమ భార్యను పట్టించుకోరంట, ఇద్దరి మధ్య సన్నిహిత్యం తగ్గతుందంట, అంతే కాకుండా ప్రతీ సారి గొడవలు జరిగే అవకాశం ఉంటుందంట.భాగస్వామి ఆలోచనల్ని గుర్తించడం, ఒకరితో ఒకరు పంచుకోవడం చాలా ముఖ్యం. కానీ ఫబ్బింగ్ వల్ల, ఎమోషనల్ కనెక్షన్ తగ్గుతుంది. మీ పార్టనర్‌కి ఎలాంటి సమస్యలు ఉన్నాయో అర్థం చేసుకోలేకపోవడం వల్ల పెద్ద సమస్యలకి దారి తీస్తుందంట. దీని వలన ఇద్దరి మధ్య గొడవలు తారా స్థాయి చేరి, విడిపోయే అవకాశం కూడా ఉంటుందంట.

అందువలన మొబైల్ ఫొన్ పక్కన పెట్టి, మీ పార్ట్‌‌నర్ మనసులో ఏం ఉందో కనుక్కోవాలి. తనకు ఉన్న సమస్యను తెలుసుకొని పరిష్కరించాలి. తనతో కాస్త సమయం స్పెండ్ చేయాలి. లేకపోతే బంధం తెగిపోయే ఛాన్స్ ఉందంట.

Read More: అలసటగా ఉంటే నిల్చునే కునుకు తీయవచ్చు.. వర్టికల్ పాడ్స్‌‌ను తయారు చేసిన జపాన్

Advertisement

Next Story