- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ex Loversవేధిస్తున్నారా? ఇలా రివేంజ్ ప్లాన్ చేయండి!!
దిశ, ఫీచర్స్ : నెలరోజుల్లో వాలెంటైన్స్ డే రాబోతోంది. నచ్చినవారికి తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రేమికులు ఇప్పటి నుంచే ఆలోచనలు మొదలుపెట్టేస్తారు. అయితే ప్రేమను తెలిపేందుకే కాదు మాజీలను గుర్తుచేసుకునేందుకు లేదా తిట్టుకునేందుకు ఓ చాన్స్ ఇస్తోంది కెనడా జూ. 'నేమ్ -ఎ-రోచ్' పేరుతో సరికొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది టొరంటో జూ వైల్డ్‌లైఫ్ కన్సర్వెన్సీ.
ఈ ప్రచారంలో జూలో ఉన్న బొద్దింకలకు తమ ఎక్స్ లవర్ పేరు పెట్టొచ్చు. తమ వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించేందుకు అడ్డుగా నిలుస్తున్న వ్యక్తిపై కోపాన్ని ఈ విధంగా చూపించవచ్చు. ఇందుకోసం రూ. 1507 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రోచ్ పేరును ప్రదర్శించే డిజిటల్ సర్టిఫికేట్, డిజిటల్ విజువల్, రసీదు పొందవచ్చు. అంతే కాకుండా వారి దాతృత్వానికి పన్ను మినహాయింపు రసీదుని అందుకుంటారు.
కాగా.. ఈ జూ నిర్వాహకులు సోషల్ మీడియాలో ఈ విధంగా యాడ్ ఇచ్చారు. 'టొరంటో జంతుప్రదర్శనశాల, టొరంటో జూ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అన్ని జీవులను గౌరవిస్తాయి. బొద్దింకలు అటవీ చెత్తను, జంతువుల మల పదార్థాలను కుళ్ళిపోవడానికి సహాయం చేయడం ద్వారా సమగ్ర పర్యావరణ పాత్రను పోషిస్తాయి. అనేక ఇతర జంతువులకు ఆహారంగా ఉంటాయి. మొక్కలు, జంతువుల ఆవాసాల స్థిరత్వంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇలాంటి బొద్దింకలకు ఎక్స్ పేర్లనే కాదు టార్చర్ చేసే బాస్, అసహ్యకరమైన బాస్, సూటిపోటి మాటలతో బాధపెట్టే బంధువుల పేర్లు కూడా పెట్టొచ్చు' అని రాసుకొచ్చారు. అయితే ఈ క్యాంపెయిన్‌పై మిశ్రమ స్పందనలు రావడం విశేషం.
ఇవి కూడా చదవండి :
వేడిని తట్టుకునేందుకు స్నో బబుల్స్ రిలీజ్ చేస్తున్న జంతువు
ప్రియుడి అంగీకారంతో గ్రాండ్‌గా దుప్పటిని పెళ్లాడిన యువతి.. (వీడియో)