అంగట్లో 'పెళ్లి కొడుకులు'.. అర్హత ఆధారంగా ఎంపికచేసుకునే అమ్మాయిలు!

by Naresh |
అంగట్లో పెళ్లి కొడుకులు.. అర్హత ఆధారంగా ఎంపికచేసుకునే అమ్మాయిలు!
X

దిశ, ఫీచర్స్ : భారతదేశంలోని చాలా గ్రామాల్లో ఇప్పటికీ ప్రతీ వారం 'సంత'లు జరుగుతుంటాయన్న విషయం తెలిసిందే. కూరగాయాల నుంచి ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ అక్కడ దొరుకుతాయి. కాగా.. పశువుల కొనుగోలు కోసం కూడా ప్రత్యేక అంగళ్లు నిర్వహించడం సాధారణమే. అలాగే కొన్ని చోట్ల 'బైక్' కొనుగోళ్ల కోసం సంతలుంటాయి. ఇదిలా ఉంటే అంగట్లో 'పెళ్లికొడుకు'ను ఎంపిక చేసుకోవడమంటే వింతే కదా! ముఖ్యంగా ఈ యుగంలో ఇలాంటివి జరుగుతున్నాయంటే అస్సలు నమ్మబుద్ధి కాదు. కానీ బీహార్‌లో 700 సంవత్సరాల నుంచి 'గ్రూమ్ మార్కెట్' జరుపుతున్నారు. ఇక్కడ మహిళలు, వారి కుటుంబ సమేతంగా వచ్చి వరుడ్ని ఎంపిక చేసుకుంటారు.


సౌరత్ మేళా లేదా సభాగచ్చి అని పిలిచే 9-రోజుల 'గ్రూమ్ మార్కెట్‌'ను కర్నాట్ రాజవంశానికి చెందిన రాజా హరి సింగ్ ఏడు శతాబ్దాల క్రితం ప్రారంభించారని స్థానికుల అభిప్రాయం. ఆ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతుండగా, మధుబని జిల్లాలోని స్థానిక మార్కెట్ ప్రాంతంలో పెళ్లికి సిద్ధమైన పురుషులు ఓ చోట వరసగా కూర్చుంటారు. ప్రతీ వరుడు వారి విద్యార్హతలు, కుటుంబ నేపథ్యంతో పాటు వారి సామర్థ్యాన్ని బట్టి ధర నిర్ణయమవుతుంది. వరుడ్ని ఎంపిక చేసుకునేందుకు మైథిలీ వంశ యువతులు తమ కుటుంబంతో కలిసి వచ్చి, అక్కడ అందుబాటులో ఉన్న పెళ్లికొడుకులతో పాటు, వారి ధరలను పరిశీలిస్తారు. ఆ తర్వాత వారి జనన ధృవీకరణ, పాఠశాల ధృవీకరణ పత్రాలను చెక్ చేస్తారు. ఒకవేళ ఆ పురుషుల్లో ఎవరైనా నచ్చితే (కొనుగోలు చేయగలిగిన) మిగతా వివరాలను చర్చించడం ప్రారంభిస్తారు.

సంప్రదాయంగా వస్తున్న బీహార్‌లోని 'గ్రూమ్ మార్కెట్‌' గురించి ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ అల్ జజీరా ఇటీవలే డాక్యుమెంట్ చేయడంతో ఇది ట్రెండింగ్‌లో నిలిచింది. ఇంజనీర్లు, వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కువ డిమాండ్ ఆల్‌జజీరా అందులో పేర్కొనగా, భారతదేశంలో వరకట్నాలు అధికారికంగా చట్టవిరుద్ధం అయినప్పటికీ, దాన్ని తొలగించడం ఈ మార్కెట్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని స్థానికులు చెబుతారు.

కొన్ని దశాబ్దాల క్రితం ఎంతో ప్రజాదరణ పొందిన బీహార్ వరుడి మార్కెట్‌కు ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ వంటి ఆప్షన్స్ ఉన్నా ఇప్పటికీ ఆదరణ అందుకుంటోంది. ప్రధానంగా వేలాది మంది బ్యాచిలర్స్ వందల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు వస్తుంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హౌదతిలో వధువు మార్కెట్ కూడా జరుగుతుంది. వధువులు వారి అర్హతలు, గృహనిర్మాణ నైపుణ్యాలను బట్టి వివిధ ధరలకు అందుబాటులో ఉంటారు.

Advertisement

Next Story