- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
100 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలంటే ఈ ఆసనాలు తప్పక వేయాల్సిందే?
దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది మానసిక ఒత్తిడితో, ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం పొందాలంటే మీ దైనందిక జీవితంలో ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలైనా యోగా చేయాలని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే యోగా చేయడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. పాంక్రియాస్(క్లోమగ్రంథి)ని ఉత్తేజితం చేస్తుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారికి మంచిది.
కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. నడుము భాగాన్ని ఉత్తేజితం చేస్తుంది. పునరుత్పత్తి అవయవాల పనితీరును క్రమపరుస్తుంది. రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది. అలాగే శరీరానికి నూతనోత్సాహం కలుగుతుంది. కీళ్లను హెల్తీ గా ఉంచుతుంది. యోగా స్ట్రెస్ ను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుందని చెప్పొచ్చు. అయితే ప్రతిరోజూ ఈ 3 ఆసనాలు చేయడం వల్ల మనిషి ఎక్కువ రోజులు బతికే అవకాశముందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
వజ్రాసనం..
వజ్రాసనం నడుము నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో ఎంతగానో మేలు చేస్తుంది. వెన్ను దిగువ కండరాలు బలోపేతం అవుతాయి. పలు గ్యాస్ట్రో సమస్యలను దూరం చేస్తుంది. హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్స్, తరచూ చీలమండ, పాదాల పెయిన్ తో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా ఈ ఆసనం చేస్తే మేలు జరుగుతుంది. అలాగే వజ్రాసనం జీర్ణ వ్యవస్థకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. భోజనం తర్వాత వజ్రాసనం చేయడం మంచిది. ఈ ఆసనాన్ని మోకళ్లపై కూర్చుని 5 నిమిషాల పాటు చేయాలి.
ధనురాసనం..
శరీరాన్ని విల్లులా వంచి చేసే ఆసనం ధనురాసనం అంటారు. ఒక క్రమ పద్ధతిలో శరీరాన్ని వెనుకకు వంచి పాదాలను చేతుల్తో పట్టుకుని ఈ ఆసనాన్ని చేయాలి. ఇది చేయాలంటే ముందుగా చదునైన ప్రదేశంలో చాప కాని అలాంటి వేరేదైనా కానీ నేలపై పరిచి దానిపై మెత్తటి దుప్పటి లాంటిది వేసి ఆసనాన్ని చేయాలి. ఈ ఆసనం చేయడం వల్ల మధుమేహం, వెన్ను నొప్పి, వెన్ను నొప్పి వంటి వ్యాధులకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు. అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.
పద్మాసనం..
పద్మాసనంలో మొదట రెండు కాళ్ళు చాపి నేలపై ఉంచాలి. తర్వాత ఎడమ కాలును కుడి తొడపై, కుడి కాలును ఎడమ తొడపై ఉంచాలి. రెండు చేతులను మోకాళ్ళపై ఉంచాలి. వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఏకగ్రతతో 5 నిమిషాల పాటు పద్మాసనం చేయాలి. నెమ్మదిగా 20-25 మినట్స్ వరకు ఈ ఆసనాన్ని వేయడానికి ట్రై చేయాలి.
ప్రతి రోజూ పద్మాసనం చేస్తే తప్పకుండా రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. అలాగే స్ట్రెస్, మలబద్ధకం, మైగ్రేన్, హార్ట్ ఎటాక్, అజీర్ణం సమస్యలకు చెక్ పెట్టొచ్చు. నత్తిగా మాట్లాడే వారు ఈ ఆసనం చేస్తూ ఓం మంత్రాన్ని జపిస్తే బాగా ఉపయోగపడుతుంది.