Yawns : ఆవలింతలు తరచుగా వస్తున్నాయా..? హెల్త్ రిస్క్‌లో ఉన్నట్లే!

by Javid Pasha |
Yawns : ఆవలింతలు తరచుగా వస్తున్నాయా..? హెల్త్ రిస్క్‌లో ఉన్నట్లే!
X

దిశ, ఫీచర్స్ : తిన్న తర్వాతనో, నిద్ర వస్తున్నప్పుడో ఆవలింతలు రావడం సహజం. కానీ అవి తరచుగా వస్తుంటే మాత్రం హెల్త్ రిస్క్‌లో ఉందనడానికి సంకేతాలు కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఎప్పుడు ఎక్కువగా వస్తాయి? ఏయే అనారోగ్య కారణాలవల్ల వస్తాయో ఇప్పుడు చూద్దాం.

తీవ్రమైన అలసట, మానసిక, శారీరక ఒత్తిడి, ఇన్‌సోమ్నియా, స్లీప్ అప్నియా, నార్కోలెప్సీ వంటి నిద్రలేమి సమస్యలు ఎదుర్కొనే వారిలో ఆవలింతలు ఎక్కువగా వస్తాయి. దీంతోపాటు డిప్రెషన్, యాంగ్జైటీ వల్ల తలెత్తే దుష్ప్రభావాల కారణంగానూ ఆవలింతలు వస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా స్లీప్ అప్నియా బాధితులు నిద్రపోతున్నప్పుడు శ్వాసరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. తద్వారా నిద్రకు ఆటంకాలు ఏర్పడి శరీరానికి తగిన విశ్రాంతి లభించదు. ఈ క్రమంలో బాడీలో జరిగే ప్రతికూల చర్యలు ఆవలింతలను ప్రేరేపిస్తాయి. అలాగే రక్తంలో గ్లూకోజ్ వెలల్స్ పడిపోయే సమయంలో, జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఆవలింతలు వస్తాయి. ఆగకుండా చాలాసేపు వస్తే మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed