- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ల్యాబ్‌లో డెవలప్ చేసిన రక్తం.. మొదటిసారి మనుషులపై ట్రయల్
దిశ, ఫీచర్స్: సాధారణంగా రక్తమార్పిడులు స్వచ్ఛందంగా రక్తదానం చేసే వ్యక్తులపై ఆధారపడి కొనసాగుతాయని తెలిసిందే. కానీ చాలాసార్లు సమయానికి తగిన గ్రూప్ బ్లడ్ లభించక చనిపోతున్న సంఘటనలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ల్యాబ్‌లో పెరిగిన రక్తాన్ని మొదటిసారి ప్రజలకు అందించినట్లు యునైటెడ్ కింగ్‌డమ్ పరిశోధకులు తెలిపారు. క్లినికల్ ట్రయల్స్‌లో రెండు స్పూన్‌ఫుల్స్‌కు సమానమైన ల్యాబ్-గ్రోన్ బ్లడ్ మనుషులకు ఎక్కించిన రీసెర్చర్స్.. వారి బాడీలో అది ఎలా స్పందిస్తుందో అంచనా వేస్తున్నారు.
ఈ ట్రయల్‌తో, అత్యవసర పరిస్థితుల్లో సేకరించడం కష్టతరమైన చాలా అరుదైన బ్లడ్ గ్రూప్స్ ఉన్న వారికి, వైద్య పరిస్థితుల కారణంగా క్రమం తప్పకుండా రక్తమార్పిడి అవసరమైన వారికి శాస్త్రవేత్తలు సాయపడాలనుకుంటున్నారు. ఖచ్చితమైన మ్యాచ్ కాకుంటే శరీరం ఆ రక్తాన్ని తిరస్కరించవచ్చు. ఇది చికిత్సా వైఫల్యానికి దారితీస్తుంది. దీని పరిధి మనకు బాగా తెలిసిన A, B, AB, O బ్లడ్ గ్రూపులకు మించి ఉంటుంది.
శాస్త్రవేత్తలు రక్తాన్ని ఎలా పెంచుతారు?
పరిశోధకులు దానం చేసిన రక్తాన్ని నిర్దేశిత పరిమాణంలో సేకరించడం ద్వారా ఈ ప్రాసెస్ ప్రారంభిస్తారు. ఇందులో ఎర్ర రక్త కణాలుగా మారగల సౌకర్యవంతమైన మూలకణాలను సేకరించేందుకు అయస్కాంత పూసలు(మాగ్నెటిక్ బీడ్స్) ఉపయోగించబడతాయి. ల్యాబ్స్‌లో, ఈ మూలకణాలు పెద్ద సంఖ్యలో పెరిగేందుకు వాతావరణం కల్పిస్తారు. తర్వాత ఎర్ర రక్త కణాలుగా మారడానికి మార్గనిర్దేశం చేయబడతాయి. మూడు వారాలు కొనసాగే ఈ ప్రక్రియలో అర మిలియన్ మూలకణాలు.. 50 బిలియన్ ఎర్ర రక్త కణాలను సృష్టించగలవు.
ఫిల్టర్ చేసిన తర్వాత, 15 బిలియన్ ఎర్ర రక్త కణాలను మార్పిడి కోసం ఉపయోగించవచ్చు. ప్రస్తుతానికి, ఇద్దరు వ్యక్తులు విచారణలో పాల్గొన్నారు. కానీ శాస్త్రవేత్తలు కనీసం 10 మంది ఆరోగ్యవంతుల్లో రక్తాన్ని పరీక్షించాలనుకుంటున్నారు. ట్రయల్స్‌లో పాల్గొనేవారికి కనీసం నాలుగు నెలల వ్యవధిలో 5-10 మి.లీ., రక్తం రెండుసార్లు(ఒకటి సాధారణ రక్తం, మరొకటి ల్యాబ్-పెరిగిన రక్తం) ఎక్కించబడుతుంది. అయితే, ల్యాబ్‌లో పెరిగిన రక్తం సాధారణ రక్తం కంటే శక్తివంతమైనదని ఆశిస్తున్న శాస్త్రవేత్తలు ఇది శరీరంలో ఎంత కాలం ఉంటుందో పరిశీలించేందుకు రేడియోధార్మిక పదార్థంతో ట్యాగ్ చేశారు.