- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > లైఫ్-స్టైల్ > World Suicide Prevention Day : ఆత్మహత్య నివారణా దినోత్సవం... సూసైడ్ ఆపేందుకు మనం చేయాల్సిన ప్రయత్నం..
World Suicide Prevention Day : ఆత్మహత్య నివారణా దినోత్సవం... సూసైడ్ ఆపేందుకు మనం చేయాల్సిన ప్రయత్నం..
X
దిశ, ఫీచర్స్ : దేశంలో ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా రైతుల కన్నా కూడా యువత ఆత్మహత్యలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. 2021లో సూసైడ్ చేసుకుని లక్షా ముప్పై వేల మంది చనిపోతే ఆ సంఖ్య 2022లో లక్షా డెబ్బై వేలకు చేరుకుంది. ఇప్పటికే పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు. పైగా దీని గురించి మాట్లాడేందుకు, అవగాహన కల్పించేందుకు సరైన కార్యక్రమాలు చేపట్టడం లేదనేది నిపుణుల అభిప్రాయం. కాగా మానసికంగా కుమిలిపోతున్న వ్యక్తులకు కొంత మాట సహాయం చేసినా చాలు వారిలో భరోసా కలిగే అవకాశం ఉందని... బతికే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఈ రోజు ఆత్మహత్యా నివారణా దినోత్సవం కాగా.. ఆత్మహత్యలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వివరిస్తున్నారు.
- ఆత్మహత్య చేసుకునే వారు పిరికివాళ్ళు కాదు. ఇందుకు చాలా కారణాలు ఉంటాయి. మెదడులో మార్పులు, మానసిక ఒత్తిడి ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసరా లేకుండా అయిపోతుంది.
- నిజానికి సూసైడ్ చేసుకునే వారు ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయంతో కాకుండా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటారు. ఆలోచించే శక్తి, ఓపిక ఉండవు. అలాంటప్పుడు వారికి సపోర్ట్ ఇవ్వడం ద్వారా సూసైడ్ ఆలోచన రాకుండా చేయవచ్చు.
- నాకు ఆత్మహత్య చేసుకోవాలని ఉంది.. చనిపోవాలని ఉంది అని చెప్పేవారిని అస్సలు లైట్ తీసుకోవద్దు. డ్రామాలు చేస్తున్నారని అనుకోకూడదు. అలాంటి వారు మరో ఒకటి, రెండు వారాల్లో చనిపోయే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. కాబట్టి మీరు వారికి మద్దతు ఇచ్చేలా ఉండండి. వారు చెప్పే విషయాలను పరిగణనలోకి తీసుకోండి. మంచి చెడు గురించి చెప్పండి. అంతేకాని కామెడీ చేయొద్దు. అవమానపరచొద్దు. మరింత హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
- మీరు వారికి సహాయం చేస్తారనే, మీరు నమ్మకస్తులనే.. ఆత్మహత్య ఆలోచనలను మీతో పంచుకుంటున్నారని గుర్తించండి. వారి మానసిక బాధను అర్థం చేసుకుని.. వెంటనే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
- చనిపోవాలని అనుకున్న వారిని మనం ఎలా ఆపగలం అని అనుకోవద్దు. ఆ వ్యక్తి మరణించాక మీరే రిగ్రెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ఆలోచన ఉన్న వారికి కొంత సేపు కాపలాగా ఉన్నా లేదా కాసేపు మీ సమయాన్ని వెచ్చించినా.. వారికి భవిష్యత్తుపై ఆశ కలుగుతుంది. తన కష్టాలు వినేందుకు ఒకరు ఉన్నారనే భరోసా వస్తుంది.
- మానసికంగా బాధ పడుతున్నవారితో గడపడం.. డేంజర్ అనుకోవద్దు. మీరు ఉన్నంత సేపు వారు అలాంటి ప్రయత్నాలు చేయరు. పైగా మీరు చావుకు, బతుకుకు మధ్య వారధిగా మారుతారు అనేది నిజం.
- ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటే సడెన్ గా ఇలా చేసుకున్నాడేంటి.. ఇన్ని రోజులు చాలా బాగుండేది కదా.. ఈరోజు కూడా నవ్వుకుంటూ మాట్లాడాడు అని అనుకుంటాం. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఇన్ని రోజుల వారి ప్రయాణం మానసిక అనారోగ్యంతో కుంగిపోతున్నట్లుగానే ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉంటే వారికి మద్దతు ఇవ్వడం బాధ్యతగా భావించండి.
నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది...
Advertisement
Next Story