- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమెన్స్ డే స్పెషల్.. అక్కడ మగవాళ్లకు వంటల పోటీలు
దిశ, వెబ్‌డెస్క్ : నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు.ఇక ఈ ఉమెన్స్ డే సందర్భంగా అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కేరళలోని మలప్పురంలో మంగళవారం సాయంత్రం వంటల పోటీ జరిగింది. వరియంకున్నత్ కున్హహమద్ హాజీ మెమోరియల్ మున్సిపల్ టౌన్ హాల్ ప్రాంగణంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మహిళా విభాగం వనితా లీగ్..అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా పురుషులకు ప్రత్యేకంగా వంటల పోటీని నిర్వహించింది.
అయితే ఈ పోటీలో పాల్గొన్న పురుషులకు ఎవ్వరికీ వంటలు రావు. అయినా వారు తమకు నచ్చినట్లు వంటలు వండుకుంటూ వచ్చారు. తమ స్టైల్లో బిర్యానీ, చికెన్ బ్రోస్ట్,ఫిష్ బిర్యానీ వండుకచ్చారు. ఇక ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, పురుషులు చేసిన వంటలకు జడ్జిలుగా మహిళలు వ్యవహరించారు. ఇక వంటల పోటీల్లో పాల్గొన్న వారందరూ 90 నిమిషాల వ్యవధిలో తమ వంటలను పూర్తిచేసి అందరినీ ఆకట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి : Ozempic: ట్రెండ్ వేవ్‌లో దూసుకుపోతున్న ‘ఓజెంపిక్’ డ్రగ్.. కారణం ఏంటంటే..!