పనులు షేర్ చేసుకుంటే.. భర్తలకు శృంగార సుఖం అమోఘం!

by sudharani |   ( Updated:2022-09-06 09:43:09.0  )
పనులు షేర్ చేసుకుంటే.. భర్తలకు శృంగార సుఖం అమోఘం!
X

దిశ, ఫీచర్స్: ఆధునిక యుగంలో కూడా ఇంట్లో స్త్రీ-పురుష అసమానతలు ఉంటున్నాయనేది వంద శాతం సత్యం. పాశ్చాత్య ప్రపంచంలో మహిళలు సమాన హక్కుల వైపు దూసుకుపోతున్నాసరే ఇప్పటికీ అధిక పని భారంతో మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్నారని నివేదికలు చెప్తున్నాయి. ఉద్యోగాన్ని వదిలేసి 24గంటలు పిల్లలను చూసుకోవడం, భర్తకు సంబంధించిన అన్ని విషయాలను చక్కబెట్టడం, అత్తమామలకు సేవలు చేసుకోవడంతోనే కాలం కరిగిపోతుండగా.. 2022 జనాభా లెక్కల ప్రకారం మహిళలు పురుషుల కంటే ఎక్కువ వేతనం లేని ఇంటి పనిని కొనసాగిస్తున్నారని కూడా స్పష్టమైంది. అయితే ఈ ఇన్‌ఈక్వాలిటీ భార్యాభర్తల బంధం, లైంగిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని తాజా అధ్యయనం తేల్చింది.

స్విన్‌బర్న్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు సంబంధాల్లో అసమానత లైంగిక కోరికను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై పరిశోధనలు నిర్వహించారు. ఈ క్రమంలోనే స్త్రీ-పురుషుల మధ్య అసమానత శృంగార కోరికలపై ప్రభావం చూపుతుందని తేల్చారు. మహిళల్లో సెక్స్ డ్రైవ్ తక్కువ ఉన్నా భర్తలకు సుఖాన్ని అందించేందుకు ప్రయత్నిస్తారు కానీ రిలేషన్‌షిప్‌లో ఫెయిర్‌నెస్ లేకపోతే మాత్రం లైంగిక ఆందోళన, ఆగ్రహం, అలసట సహా అనేక సమస్యలు ఎదురవుతాయని పేర్కొంది. ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత మహిళలకు పనిభారం పెరిగి వివాహ బంధం దెబ్బతినే అవకాశం ఉంది. ఇక రిలేషన్‌షిప్ లెంత్(బంధానికి సంబంధించిన కాలం) కూడా ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తుందని అధ్యయనం నిరూపించింది. భాగస్వామితో లైంగికంగా విసుగు చెందే అవకాశముందని తేలింది. అంతేకాదు మహిళలు తమ భాగస్వాముల రోజువారీ జీవిత నిర్వహణ గురించి శ్రద్ధ తీసుకుంటారు కాబట్టి ఓవర్‌టైమ్ సంబంధాల్లో వారు అన్యాయం అయిపోయే పరిస్థితి ఉంది. అందుకే పనులు షేర్ చేసుకునే భాగస్వాములతో ఉన్న స్త్రీలలో సెక్స్ డ్రైవ్ ఎక్కువగా ఉంటుందని అధ్యయనం రుజువు చేసింది.

ఏం చేయాలి?

* అసమానతలు తగ్గించేందుకు మొదటి అడుగు వేయాలి.

* ఇంటి పనులు, వంట పనులు షేర్ చేసుకుని భారం తగ్గించుకోవాలి.

* తద్వారా మెంటల్ లోడ్ తగ్గి శృంగార కోరికలు పెరిగే అవకాశం.

Also Read : SEX లో ట్విన్ స్టిమ్యులేషన్ ట్రిక్.. ఊహించని స్థాయిలో ప్లెజర్

Advertisement

Next Story