ఈ రాశుల స్త్రీలు చాలా రొమాంటిక్ గురూ..

by Sumithra |   ( Updated:2024-01-04 15:11:53.0  )
ఈ రాశుల స్త్రీలు చాలా రొమాంటిక్ గురూ..
X

దిశ, ఫీచర్స్ : కొన్ని రాశుల స్త్రీలను చూస్తే చాలు ఆకర్షణీయంగా ఉంటారు. వారి రంగు, ఎత్తు ఎలా ఉన్నా మొహం మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. మరి కొన్ని రాశుల స్తీలు అనుకువగా అందరినీ ప్రేమతో ఆప్యాయంగా చూసుకుంటారు. మరి కొన్ని రాశి చక్రం గల మహిళలు మాత్రం ఎంతో రొమాంటిక్ గా ఉంటారు. వారి జీవిత భాగస్వామితో ప్రతి పనిలోనూ రొమాన్స్ చేస్తూ వారితో బంధాన్ని మెరుగు పరుచుకుంటారు. దీంతో భార్య భర్తల మధ్య దాపరికాలు లేకుండా అన్ని విషయాలను ఒకరికొకరు పంచుకుంటూ ఉంటారని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏంటో తెలుసుకోవాలని ఉంది కదా.. ఆ రాశులు ఏవో, అందులో మీ జీవిత భాగస్వామి రాశి ఉందో లేదో చూడండి మరి...

సింహరాశి : ఈ రాశి వారు ఇతర విషయాల్లోనే కాదు శృంగారం విషయంలో కూడా ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తారు. ఏ మాత్రం బిడియం లేకుండా తన భాగస్వామితో శృంగారభరితంగా ఉండేందుకు ఇష్టపడతారు. ఈ రాశిగల వారు వ్యామోహాన్ని, ఇష్టాన్ని, ప్రేమను చాలా రొమాంటిక్ గా వ్యక్తపరుస్తారు.

వృషభ రాశి : ఈ రాశి స్త్రీలు తమ భాగస్వామితో చాలా రొమాంటిక్ గా వ్యవహరిస్తారు. వివాహ సంబంధం, ప్రేమ సంబంధం, శారీరక సాన్నిహిత్యానికి ఈ రాశి గల స్త్రీలు ఎక్కువగా విలువ ఇస్తారు. పనిచేస్తూనే తన పార్ట్నర్ కి రొమాంటిక్ టచ్ ఇస్తూ ఇంద్రియాలను తట్టిలేపుతారు. వృషభ రాశి స్త్రీలు ప్రేమను, కోరికను, ఇష్టాన్ని వ్యక్త పరిచేందుకు శృంగారాన్నే ఎంచుకుంటారు. రొమాన్స్‌లో వారు తృప్తిని పొందడంతో పాటు వారి భాగస్వామిని కూడా సుఖంలో ముంచెత్తుతారు.

తులా రాశి : ఈ రాశి గల స్త్రీలు సహజంగానే శృంగారానికి ఆకర్షితులవుతారు. వారు రొమాంటిక్ గా ఉండడమే కాకుండా వారి జీవిత భాగస్వామి కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. తన పార్ట్నర్ పై తమకు ఉన్న ప్రేమను రొమాన్స్ తో వ్యక్తపరుస్తారు. ప్రియుడు లేదా భర్త చేసే శృంగార భరిత టచ్ లను వారు ఎంతగానో ఇష్టపడతారు.

కర్కాటక రాశి : ఈ రాశి వారు తమ భాగస్వామి పై ప్రత్యేక శ్రద్ధను చూపిస్తారు. ప్రేమను శృంగారం ద్వారా వ్యక్తపరుస్తారు. వారు తమ పార్ట్నర్ తో ఉన్న ప్రతి చోట రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టిస్తారు.

మీన రాశి : ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామిని ప్రేమించడంలో ప్రత్యేకంగా వ్యవహరిస్తారు. వీరు శృంగారభరితంగా ఉంటూ భాగస్వామిలో కోరికను, ఉత్సాహాన్ని వెలికి తీస్తారు.

Advertisement

Next Story