Viral: వీధుల్లో నడయాడిన అందం.. అందరూ ఫిదా! (వీడియో)

by Javid Pasha |   ( Updated:2024-02-12 06:41:18.0  )
Viral: వీధుల్లో నడయాడిన అందం.. అందరూ ఫిదా! (వీడియో)
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. కానీ కొన్ని మాత్రమే అద్భుతంగా అనిపిస్తాయి. అవి ప్రజలను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటాయి. అలాంటిదే ఒక సంఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. దగ దగా మెరిసే ఆభరణాలతోపాటు రెడ్ కలర్ వెడ్డింగ్ లెహంగా ధరించిన ఓ యువతి లండన్ వీధుల్లో షికారు చేస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ప్రజెంట్ ఇన్‌స్టా గ్రామ్‌లో చక్కర్లు కొడుతోంది. ఆమె ధరించిన డ్రెస్, నడిచే స్టైల్, ముసి ముసి నవ్వులు అందరినీ కట్టిపడేస్తున్నాయి. ఈ రీల్‌ను ఇన్‌స్టాలో 1,68,000 మంది ఫాలోవర్లను కలిగి ఉన్న శ్రద్ధా అనే ఒక స్పానిష్-ఇండియన్ మోడల్ షేర్ చేసింది. ఆమె తనను తాను డిజిటల్ మార్కెటర్ అండ్ వైరల్ మీడియా ఎక్స్‌పర్ట్‌గా తన ప్రొఫైల్‌‌లో పేర్కొంది.

వీడియోలో రెడ్ కలర్ ఎంబ్రాయిడరీ వెడ్డింగ్ ‘లెహెంగా’ ధరించిన యువతి లండన్ వీధుల్లో షికార్లు కొట్టడంతోపాటు ఆమె ఒక రైలులోకి ప్రవేశించించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ప్రయాణికులు ఆమెను, ఆమె వస్త్రధారణను చూసి బాగా అట్రాక్ట్ అయ్యారు. ఎందుకంటే లండన్‌లో ఇలాంటి వస్త్రాలు ధరించేవారు చాలా తక్కువ. పైగా అది ఇండియన్ సంప్రదాయ దుస్తులను పోలి ఉండటంవల్ల అందరినీ ఆకర్షించింది. కొందరు ఆ యువతిని ప్రశంసించగా, మరికొందరు ఆమెతో ఫొటోలు తీసుకున్నారు. ఫిబ్రవరి 1న ఈ వీడియో షేర్ చేసినప్పటికీ ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంది. ఇన్‌స్టాలో ఈ స్టయిలిష్ యువతి రీల్‌కు ఇప్పటి వరకు 27,32,494 లైక్స్ రాగా, 42 మిలియన్ల కంటే వ్యూస్ ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి!

Advertisement

Next Story