- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
టాటూస్ వేసుకుంటే తప్పేముంది.. ఎంప్లాయ్స్‌కు మేనేజర్ సపోర్ట్!
దిశ, ఫీచర్స్ : న్యూస్ రీడర్లు అంటేనే ప్రొఫెషనలిజంకు మారుపేరు. ఆహ్లాదకరమైన ఆహార్యంతో వీక్షకులను ఆకట్టుకునేలా న్యూస్ ప్రజెంట్ చేయడం వీరి ప్రత్యేకత. అయితే న్యూజిలాండ్‌లోని ఓ న్యూస్‌చానెల్ యాంకర్ మాత్రం ముఖంపై టాటూతో ప్రైమ్ టైమ్ న్యూస్ చదివి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె తమ ట్రైబ్ సంప్రదాయం ప్రకారం 'మెకో కవూ' టాటూ వేసుకోగా.. ఇప్పుడు మరో మహిళ తన ఒంటిపైనున్న టాటూస్ పట్ల తన కొత్త బాస్ ప్రతిస్పందన గురించి చేసిన పోస్ట్ ఆకట్టుకుంటోంది.
ప్రతి కంపెనీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండటం సహజం. ఉద్యోగులు 'ప్రొఫెషనల్ లుక్'లో కనిపించాలనే నియమం కూడా అందులో భాగమే. నిజానికి వృత్తిపరమైన ప్రపంచంలో 'టాటూ' గురించి కళంకం ఉన్నప్పటికీ, ఇప్పుడిప్పుడే వాటిని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన జెస్సికా లియోనార్డ్.. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఎవల్యూషన్ క్యాపిటల్‌లో భాగస్వామిగా చేరింది. ఈ క్రమంలోనే ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో రెండు ఫోటోలను అప్‌డేట్ చేసింది. ఒక ఫొటోలో టాటూస్ మొత్తం కవర్ అయ్యేలా సూట్‌లో కనిపించింది.
మరొక ఫొటోలో టాటూస్‌తో నిండిపోయిన చేతులు కనిపించేట్లుగా స్లీవ్‌లెస్ డ్రెస్‌లో ఉంది. ఇక ఆమె పోస్టుకు కొన్ని పాజిటివ్ కామెంట్స్ లభించినా.. ప్రొఫెషనల్‌గా ఉండాలంటే టాటూస్ వేసుకోవడం కరెక్ట్ కాదని కొందరు ఆమెకు గట్టిగానే చెప్పే ప్రయత్నం చేశారు. అయితే జెస్సికా బాస్ మాత్రం.. 'నేను టాటూస్‌ను ప్రేమిస్తున్నా. అవి చేస్తున్న ఉద్యోగాన్ని లేదా వారి మంచితనాన్ని నిర్ణయించవు. గర్వంగా టాటూస్ ధరించండి' అంటూ ఎంకరేజింగ్‌గా పోస్ట్ చేయడం జెస్సికాను ఆశ్చర్యపరిచింది. అంతేకాదు 'ఎవల్యూషన్ క్యాపిటల్' ఆమె టాటూస్ పిక్‌ను తమ వెబ్‌సైట్ కోసం ఉపయోగించింది.
'బాడీ ఆర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పటిదాకా ప్రొఫెషనలిజం భయంతో టాటూస్ ఎక్కువగా వేసుకోవాలనే కోరికను నియంత్రిస్తూ వచ్చాను. అయితే ఇటీవలి అనుభవాలు నా అభిప్రాయాలను మార్చేశాయి. నేను జాకెట్‌లో ఉన్నా, లేకపోయినా ఒకే వ్యక్తిని. ప్రతిరోజూ మనల్ని మనలాగే కనిపించేందుకు అనుమతిస్తూ, ఇష్టాన్ని ప్రోత్సహించే నాయకులుంటారు. 'లౌడ్ అండ్ ప్రౌడ్!' వాట్ ఎ బాస్!!". మీ వల్లనే ఇప్పుడు నా సొంత చర్మంలో మరింత సౌకర్యవంతంగా ఉండగలుగుతున్నాను' అని జెస్సికా పేర్కొంది.