- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాన్ స్టాప్‌గా 100 గంటల పాటు వంట చేసి మహిళ గిన్నీస్ రికార్డ్..!
దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా చాలా మంది వంటలు గంట, లేదా రెండు గంటలు, ఒక పూట, ఒక రోజు చేసి పూర్తిగా అలసిపోతారు. మళ్ళీ ఇతర పనులు చేయడానికి చాలా కష్టపడిపోతుంటారు. మరికొంత మంది అయితే వంట పనిని అదో పెద్ద టాస్క్‌లా భావించి ఇష్టం లేకుండా వంటలు చేస్తారు. కానీ, ఓ మహిళ మాత్రం ఏకంగా 100 గంటలు అంటే దాదాపు నాలుగున్నర రోజులు వంట చేసి గిన్నిస్ రికార్డులో కెక్కింది.
వివరాల్లోకి వెళితే.. నైజీరియాలోని లెక్కి ప్రాంతంలో హిల్దా బాసి అనే మహిళ నివాసం ఉంటోంది. అయితే ఆమె 100 గంటల సేపు వంట చేసి రికార్డు సృష్టించింది. దీనికోసం హిల్దా గత గురువారం వంట ప్రారంభించి లండన్ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7,45 నిమిషాలకు పూర్తి చేసింది. హిల్దా నైజీరియాకు సంబంధించిన ప్రత్యేక వంటకాలు, సూప్‌లు, టమాటా రైస్ వంటి డిష్‌లను తయారు చేసింది. అయితే ఆమె నాన్ స్టాప్‌గా 12 గంటల పాటు వంట చేసిన తర్వాత ఓ గంట సేపు విశ్రాంతి తీసుకుని తన పర్సనల్ పనులను ముగించింది. హిల్దా ఆఫ్రికన్ మహిళలకు సంఘీభావంగా గానే తాను ఈ పని చేసినట్లు తెలియజేసింది. 2019లో భారత చెఫ్ లతా టాండన్ ఏకధాటిగా 87 గంటల 45 నిమిషాలు వంట చేసి రికార్డును నెలకొల్పారు. ఆ రికార్డును నైజీరియా చెఫ్ హిల్దా బాసి బ్రేక్ చేసి సరికొత్త రికార్డును సృష్టించింది.
Also Read..
Beer: ఎర్రటి ఎండలో చల్లటి బీర్ తాగేవారు.. వీటిని అస్సలు తీసుకోకూడదు?