అగ్లీ డైవోర్స్.. భయంకరమైన ఫొటో‌షూట్‌తో విడాకులను సెలబ్రెట్ చేసుకున్న మహిళ

by Vinod kumar |   ( Updated:2023-04-14 12:41:43.0  )
అగ్లీ డైవోర్స్.. భయంకరమైన ఫొటో‌షూట్‌తో విడాకులను సెలబ్రెట్ చేసుకున్న మహిళ
X

దిశ, ఫీచర్స్: విడాకులు (Divorce) తీసుకోవడం అనేది ఎవరికైనా బాధాకరమైన స్విచ్యువేషన్‌గానే ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఒక మహిళ తన విడాకుల సందర్భాన్ని భయంకరమైన ఫొటో షూట్‌తో ఫన్నీగా జరుపుకుంది. నిజంగా చెప్పాలంటే ఒకసారి రిలేషన్‌షిప్‌లోకి అడుగు పెట్టాక, విడిపోవాలని ఎవరూ అనుకోరు. అసలు ఊహించరు కూడా. ఎందుకంటే వివాహం అటువంటి సంప్రదాయబద్దమైన, సంతోషకరమైన భరోసాను ఇస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో విడిపోవడమే బెటర్ అనే నిర్ణయానికి వస్తారు.

లారెన్ బ్రూక్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. విడాకుల ప్రక్రియను ఇంటర్నెట్ వేదికగా భయంకరమైన ఫొటోషూట్ లైవ్‌తో సెలబ్రేట్ చేసుకుని, అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇంత హ్యాపీనెస్ ఎందుకు అంటే.. పెళ్లిలో ఆమె ఎదుర్కొన్న కష్టాలు, డైవోర్స్ తీసుకుని ఆనందాన్ని, స్వేచ్ఛను ఆస్వాదించడానికి ఏడాది పాటు ప్రయత్నాలు అని చెప్తోంది. సంప్రదాయానికి తనదైన శైలిలో ట్విస్ట్ ఇవ్వాలని నిర్ణయించుకుని తన తల్లి, ఫ్రెండ్స్ సహాయంతో ఐకానిక్ అగ్లీ ఫొటోషూట్ చేస్తూ డివోస్‌ను సెలబ్రేట్ చేసుకుంది.


బ్రూక్ తన విడాకులను ఫొటోషూట్ ద్వారా సెలబ్రేట్ చేసుకుని, తన ఆత్మగౌరవాన్ని చాటాలనుకుంది. ఆ ఉద్దేశంతోనే ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఇంటర్నెట్‌లో ఒక పోస్టు పెట్టగా అనేకమంది మద్దతుగా నిలిచారు. అంతేగాక ఆ భయంకరమైన అగ్లీ ఫొటో షూట్‌కు పలువురు హాజరయ్యారు. ఆ ఇమేజెస్ ఇంటర్నెట్‌లో హల్ చల్ చేశాయి. ఈ ఫొటోషూట్ ఇమేజెస్‌ను బ్రూక్ ఇంటర్నెట్‌లో పోస్టు చేస్తూ “గతేడాది నేను బాధతో ఉన్నాను. ఇబ్బంది పడ్డాను.

కానీ ప్రస్తుతం బయటపడ్డాను’’ అని క్యాప్షన్ ఇచ్చింది. అంతేగాక ఇటువంటి విడాకుల ఫొటోషూట్‌తో చాలా ఫన్‌గా అనిపించిందని కూడా చెప్పుకొచ్చింది. “విడాకులు తీసుకోవడం ఎవరికైనా బాధాకరమైన అంశం. నిజాయితీగా పెళ్లి చేసుకున్నప్పుడు ఇది మీరు ఊహించే విషయం కాదు! మీరలా చేయాలని నేను కోరుకోవడం లేదు. కానీ నా విషయంలో మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను” అని పేర్కొన్నది బ్రూక్. తాను తీసుకున్న నిర్ణయం వల్ల గతంలో విడిపోయిన స్నేహితులను తిరిగి పొందగలిగానని చెప్పింది.


ఆమె విడాకులు తీసుకొని, జీవితంలో కొత్త చాప్టర్ ప్రారంభించిన విధానం ఇంటర్నెట్ వేదికగా చాలామందిని ఆకట్టుకుంది. పలువురు ఆమెను చూసి ముగ్ధులవ్వడమే కాకుండా గర్వపడుతున్నామని పేర్కొన్నారు. కొందరు మేమూ మిమ్మల్ని అనుసరిస్తామని కామెంట్ చేశారు. తాను ఇటువంటి డైవోర్స్ షూట్‌ కోసమైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్తున్నారు. విడాకులు విషయంలో సమాజం ఎలా స్పందిస్తుందోనని కొందరు భయపడుతుంటారు. బట్ యూ నో ఎబౌట్ కల్చర్ అండ్ సొసైటీ అని ఒక యూజర్ స్పందించాడు.

Read more:

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శాండ్‌విచ్.. 48 గంటల ముందు ఆర్డర్ చేయాల్సిందే..

Advertisement

Next Story