- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దాని సైజ్ 4 సెం.మీ. ఉంటే ట్యూబెక్టమీ చేయించుకున్నా పిల్లలు పుడతారా..? వైద్యులు ఏం చెబుతున్నారంటే..?
దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది ఒకరు లేక ఇద్దరు పిల్లలతోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు లేదా ఇతర కారణాలతో పుట్టిన ఒక్కరిని మంచిగా పెంచుకుంటే చాలు అనుకుంటూ ఈ నిర్ణయానికి వస్తారు. అయితే.. వారి ఆర్థిక పరిస్థితులు మెరుగు పడటమో లేక మొదటి బిడ్డకు ఆరోగ్య లోపాలు ఉండటంతోనో మరో బిడ్డను కనాలనుకుంటారు. మరి.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగిన తర్వాత మళ్లీ బిడ్డకు జన్మనివ్వడం సాధ్యమేనా..? దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
కుటుంబనియంత్రణ ఆపరేషన్‌ను అనేది స్త్రీలు, పురుషులు ఇద్దరూ చేయించుకుంటారు. ఇందులో స్త్రీలు చేయించుకునే ఆపరేషన్‌ను ట్యూబెక్టమీ అని అంటారు. గర్భాశయానికి ఫాలోఫియన్ నాళాలను రెండు వైపులా శాస్త్ర చికిత్స ద్వారా కత్తిరిస్తారు. అనంతరం ఒక వైపు ఉండే ట్యూబ్‌ని మధ్యలో ముడివేయడం, లేదా వాటి కొసలను దారంతో ముడివేయడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల గర్భం రాకుండా ఉంటుంది.
ఇలా ట్యూబెక్టమీ చేయించుకున్న తర్వాత కూడా పిల్లలు పుట్టడం సాధ్యమేనా అని చాలా మందికి సందేహాలు ఉంటాయి. అయితే సాధ్యమే అంటున్నారు వైద్య నిపుణులు. సర్జరీ ద్వారా గర్భాశయంలో కట్ చేసిన ట్యూబ్లను.. మళ్లీ ట్యూబ్ రీకెనలైజేషన్ ఆపరేషన్ చేస్తారు. పీరియడ్స్ అయిన 7వరోజు HSG టెస్ట్ చేసి, వచ్చిన రిపోర్టు ఆధారంగా ఆపరేషన్ చేస్తారు. ట్యూబెక్టమీ చేసిన టైంలో ఎంత ట్యూబ్‌ని కత్తిరించారో దాన్ని బట్టి మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఒకసారి కట్ చేశాక మళ్లీ వాటిని కలపాలంటే కష్టం. ఎందుకంటే ఇవి చాలా బలహీనంగా ఉంటాయి. వయస్సు ఎక్కువ, ట్యూబ్స్ బలహీనంగా ఉన్నవారిలో పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. మళ్లీ రీకెనలైజేషన్ చేసుకోవాలంటే ట్యూబ్స్ 4సెం.మీ కంటే ఎక్కువ ఉండాలి. ఆపరేషన్ అయిన 33ఏళ్ల లోపు ట్యూబ్ రీకెనలైజేషన్ చేయించుకోవాలి.