- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తరచూ హస్తప్రయోగం మంచిదే.. శాస్త్రీయ కారణాలతో నిరూపితం
దిశ, ఫీచర్స్ : వయసు, జెండర్‌తో సంబంధం లేకుండా అడల్ట్స్ అందరిలో హస్త ప్రయోగం(Masturbation)..సహజంగా కోరికల నుంచి విముక్తి కలిగించేదే కాక సంతృప్తినిస్తుంది కూడా. దురదృష్టవశాత్తు సెక్స్ చుట్టూ నెలకొన్న కళంకం ఈ పదాన్ని నిషిద్ధ అంశంగా మార్చింది. ఇలాంటి స్వయం ప్రేరేపిత చర్యలను అపరాధంగా, అవమానకరంగా చిత్రీకరించింది. కానీ ఆర్కైవ్స్ ఆఫ్ సెక్సువల్ బిహేవియర్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం మాత్రం లైంగిక అభివృద్ధి, పనితీరుతో పాటు మొత్తం ఆరోగ్యంలో హస్త ప్రయోగం కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించింది. స్వీయ-ఉద్దీపన వల్ల కలిగే ఐదు నిరూపిత ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించింది.
* మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది
ఫ్రాంటియర్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. 50శాతానికి పైగా మహిళలు పడుకునే ముందు హస్తప్రయోగం చేయడం వల్ల గాఢ నిద్ర అనుభవించినట్లు నివేదించారు. ఎందుకంటే భావప్రాప్తి పొందినపుడు శరీరం ఆక్సిటోసిన్, సెరోటోనిన్, వాసోప్రెసిన్, ప్రోలాక్టిన్ వంటి న్యూరోకెమికల్స్ మిశ్రమాన్ని విడుదల చేస్తుంది. ఇవి శరీరానికి విశ్రాంతినిచ్చి, నిద్రకు ఉపక్రమించేలా చేస్తాయి.
* మానసిక ఆరోగ్యానికి మేలు
భావప్రాప్తి సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్.. కార్టిసాల్(ఒత్తిడి హార్మోన్)ని తగ్గించి మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇది ఒత్తిడి స్థాయిలను నియంత్రించి మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. హస్తప్రయోగం ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. లైంగికత అన్వేషణలో, ఎరోజెనస్ జోన్‌లను బాగా తెలుసుకోవడంలోనూ సాయపడుతుంది.
* అదనపు కేలరీల బర్నింగ్‌లో హెల్ప్‌ఫుల్
PLOS Oneలో ప్రచురించబడిన ఒక పరిశోధనా పత్రం ప్రకారం.. మహిళలు భావప్రాప్తి సమయంలో సగటున 69.1 కిలో కేలరీలు బర్న్ చేస్తారు. అంటే ఎంత ఎక్కువ హస్తప్రయోగం చేస్తే అంత ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. ఈ లెక్కన ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకునేందుకు ఇదొక ఆహ్లాదకరమైన మార్గమని తెలుస్తోంది.
* పీరియడ్ క్రాంప్స్ నుంచి ఉపశమనం
స్వీయ ఉద్దీపన చర్యల ఫలితంగా విడుదలయ్యే ఆక్సిటోసిన్, డోపమైన్ సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తాయి. పీరియడ్స్ క్రాంప్స్ తగ్గించడంలో సాయపడతాయి. అంతేకాదు భావప్రాప్తి పొందినప్పుడు రక్తం గర్భాశయానికి చేరుకుంటుంది కనుక తిమ్మిరి నుంచి ఉపశమనం కలిగించడంలో తోడ్పడుతుంది.
* గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
హస్తప్రయోగం హృదయ స్పందన రేటును తేలికపాటి నుంచి మితమైన కార్యాచరణకు సమానంగా పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మెరుగైన ఆరోగ్యం, గొప్ప అనుభూతి పొందేందుకు ఇంతకన్నా ఆహ్లాదకరమైన మార్గం లేదనేది నిపుణుల అభిప్రాయం.
ఇలా Sex చేస్తే జలుబు, ముక్కు దిబ్బడ మాయం
జిమ్‌కు వెళ్లకుండానే బాడీ బిల్డింగ్.. పుషప్స్‌తో పంజాబ్ కుర్రాడి గిన్నిస్ రికార్డ్!
- Tags
- SEX