- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండుగ సేల్స్‌లో స్వదేశీ ఉత్పత్తిదారుల కొత్త స్ట్రాటజీ.. బడా బ్రాండ్లకు దీటుగా డిస్కౌంట్స్
దిశ. ఫిఛర్: ప్రతి ఏడాది వలె ఈసారి కూడా కస్టమర్లు అతిపెద్ద పండగ షాపింగ్ కోసం ఆన్‌లైన్ బాటపడుతున్నారు. ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు సైతం తమ వార్షిక విక్రయాల నిమిత్తం 'గ్రేట్ ఇండియన్ షాపింగ్ ఫెస్టివల్, బిగ్ బిలియన్ డేస్' తేదీలను ప్రకటించాయి. ఇవేకాక లీడింగ్ మార్కెట్ ప్లేసెస్ Myntra, Nykaa, Ajio, Tata Cliq వంటి సంస్థలు కూడా ఆఫర్లతో జనాలను ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. గత రెండేళ్లలో పుట్టుకొచ్చిన అనేక చిన్న, స్థానిక బ్రాండ్లు సైతం గ్రేట్ ఇండియన్ షాపింగ్ మేళాలో కస్టమర్లకు సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి.
అయితే మెట్రో, టైర్ I & టైర్ II నగరాల్లోని వివిధ స్వదేశీ బ్రాండ్ల యజమానుల్లో చాలామంది తమ ప్రొడక్ట్స్ డెలివరీకి ఈ-కామర్స్ మార్కెట్‌పై ఆధారపడకుండా D2C మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇంతకీ ఈ స్ట్రాటజీ వెనకున్న ఉద్దేశ్యం ఏంటి? అసలు వర్కవుట్ అవుతుందా? లేదా? ఎక్స్‌క్లూజివ్ ప్రొడక్ట్స్, స్పెషల్ డీల్స్‌పై ఫోకస్ చేయడం వల్ల తమ వెబ్‌సైట్స్ లేదా సోషల్ మీడియా పేజీల్లో షాపింగ్ చేయడానికి కస్టమర్లను ఆకర్షించవచ్చని లోకల్ బ్రాండ్స్ యజమానులు విశ్వసిస్తున్నారు. ఈ మేరకు తమ D2C చానెల్స్‌ను పటిష్టపరిచేందుకు పండగ సీజన్ సేల్స్‌ను ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
D2C రూట్ : పదేళ్లుగా భారతదేశంలో ఈ కామర్స్ ఇండస్ట్రీ విపరీతమైన పెరుగుదలను చూసింది. పాండమిక్ పరిస్థితులు బిజినెస్ డైనమిక్స్‌ను మార్చేశాయి. పెద్దవి, చిన్నవి అని తేడా లేకుండా అన్ని బ్రాండ్లు.. ఆన్‌లైన్ బిజినెస్ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. అయినప్పటికీ, ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లలో కస్టమర్లను కనుగొనడం వల్ల కలిగే 'సైడ్ ఎఫెక్ట్స్' గుర్తించేందుకు బ్రాండ్లకు ఎక్కువ సమయం పట్టలేదు. ఇక ఈ-కామర్స్ పోర్టల్స్ ద్వారా ప్రొడక్ట్స్ విక్రయించడం వల్ల కలిగే ప్రయోజనం.. ఒక బ్రాండ్‌కు లభించే స్పష్టమైన దృశ్యమానత. అయితే ఇక్కడ అన్ని ధరల శ్రేణిలో వందలాది బ్రాండ్లతో పోటీ పడాల్సి ఉంటుంది. అదే సొంత వెబ్‌సైట్‌లో అయితే బందీలైన ప్రేక్షకులను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో కంటే ఎక్కువగా ఎంగేజ్ చేసే అవకాశం ఉందని మింత్రాలో ఆభరణాల బ్రాండ్ 'రూబన్స్' వ్యవస్థాపకుడు చిను కాలా చెప్పారు.
పెద్ద బ్రాండ్ల డిస్కౌంట్లతో పోటీపడలేం..
విజిబిలిటీ, డిస్కవరీతో పెద్ద ఈ-కామర్స్ మార్కెట్‌ప్లేస్‌లు బ్రాండ్ ప్రొడక్ట్స్‌కు సాయపడతాయి. అయితే అనేక కొత్త కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్య కూడా ఇదే. కాబట్టి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న చిన్న వ్యాపారాలు.. బ్రాండ్ బిల్డింగ్‌లో ముఖ్యమైన పాత్ర పోషించగల 'ప్రకటన మాధ్యమం'గా ఈ-కామర్స్‌ను ఉపయోగించాలని Avimee Herbal హెయిర్ కేర్ బ్రాండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధాంత్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఇది 2021లో D2C వ్యాపారంగా ప్రారంభమైన అవిమీ ఉత్పత్తులను సోషల్ మీడియా చానెల్స్‌తో పాటు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ ఏడాది జులై వరకు ఎటువంటి ఈ-కామర్స్ జోక్యం, ఎక్స్‌టర్నల్ ఫండింగ్ లేకుండా రూ. 13 కోట్ల విక్రయాలు సాధించింది అవిమీ. గత త్రైమాసికంలో మాత్రమే ఈ బ్రాండ్ అమెజాన్‌లో జాబితా చేయబడింది. ప్రస్తుతం టాప్ 10 హెయిర్ ఆయిల్ సెల్లింగ్ బ్రాండ్స్‌లో ఒకటిగా ఉన్నప్పటికీ 'amla oil' వంటి కీవర్డ్ సెర్చింగ్స్‌లో ఎప్పుడూ కనిపించదు. ఎందుకంటే ఆ ప్లేస్‌ను బడా బ్రాండ్లు కవర్ చేశాయి. పైగా ఇది 'డిస్కౌంట్ బేస్డ్' ప్లాట్‌ఫామ్ అయినందున అధిక డిస్కౌంట్ ఇచ్చిన ఉత్పత్తులే టాప్‌లో జాబితా చేయబడతాయి. మరి ఆఫర్లకు నిధులు లేనటువంటి చిన్న వ్యాపారాలు ఎక్కడికి వెళ్తాయి?'
ప్రముఖ బ్రాండ్ల ఫేక్ రివ్యూస్ స్ట్రాటజీ
'కొనుగోళ్ల విషయంలో అనేక ప్రముఖ బ్రాండ్లు 'ఫేక్ రివ్యూస్' స్ట్రాటజీని అనుసరిస్తున్నాయి. ఇదే చిన్న అమ్మకందారుల కష్టాలను పెంచుతోంది. ఇండియాలో D2C ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉంది. అయితే 2015 నుంచి పరిశీలిస్తే 2025 వరకు 15 రెట్లకు పైగా వృద్ధి చెందుతుందని స్టాటిస్టా పేర్కొంది. 2025 నాటికి D2C మార్కెట్ విలువ మూడు రెట్లు పెరిగి $100 బిలియన్‌కు చేరుకుంటుందని అంచనా వేయబడింది. అంతేకాదు దశాబ్దకాలానికి ముందే మొదలైన ఈ-కామర్స్ మార్కెట్‌ప్లేస్ కూడా 2024 నాటికి సుమారు $96 బిలియన్లకు పెరిగే అవకాశం ఉంది.
ధరల యుద్ధం..
చిన్న బ్రాండ్స్ D2C మార్గాన్ని ఎంచుకోవడానికి 'ధరల యుద్ధం' కూడా ఓ కారణమని UBON వ్యవస్థాపకుడు మన్‌దీప్ అరోరా వెల్లడించాడు. ఎందుకంటే తమ వ్యాపారాలను సొంత నిబంధనలపై నడిపేందుకు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అనుమతించవని, ఉత్పత్తులకు సొంతంగా ధరలను నిర్ణయించే అధికారం తమకు ఉండదని తెలిపారు. కాగా 2021 ఆర్థిక సంవత్సరంలో UBON 5% వృద్ధి చెందింది. 2022 చివరి నాటికి 10% వృద్ధి చెందుతుందని మన్‌దీప్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ-కామర్స్‌తో బ్రాండ్ల వ్యాపారం కష్టమే..
ఈ పరిస్థితిపై ఈ-కామర్స్ ఎనేబుల్‌మెంట్ కంపెనీ 'గోక్విక్' కో-ఫౌండర్ చిరాగ్ తనేజా పలు విషయాలు వెల్లడించాడు. ఈ-కామర్స్ మార్కెట్‌ప్లేస్‌లలో పరిపక్వత.. కమీషన్ల పెరుగుదలకు దారితీస్తుందని, బ్రాండ్లు వారితో వ్యాపారం కొనసాగించడం సాధ్యం కాదని తెలిపారు. ఇందుకు ఆడియో డివైసెస్ బ్రాండ్ 'boAt' ను ఉదాహరణగా చూపారు. boAt అమ్మకాల్లో 85% ఈ-కామర్స్ నుండే వస్తుంది. ఇది మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. కానీ ఈ బ్రాండ్ ఇప్పుడు D2C మోడ్‌లో మార్కెట్‌లో చొచ్చుకుపోయేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా షాపింగ్ చేస్తున్న కస్టమర్ల సంఖ్య పెరగడం, అందరికీ డేటా అందుబాటులో ఉండటం వంటి కారణాల వల్ల ఇది వర్కవుట్ కావచ్చు.
ఇవి కూడా చదవండి: యూట్యూబ్‌లో 'డిస్‌లైక్' చేస్తే సజెషన్స్ మారవు : అధ్యయనం