ఐ ఫోన్ వినియోగదారులు ఆండ్రాయిడ్‌ను ఎందుకు ఇష్టపడరు.. కారణం ఇదే

by Sumithra |
ఐ ఫోన్ వినియోగదారులు ఆండ్రాయిడ్‌ను ఎందుకు ఇష్టపడరు.. కారణం ఇదే
X

దిశ, ఫీచర్స్ : ఆండ్రాయిడ్‌ ఫోన్ వినియోగదారులు ఐఫోన్‌కి మారాలని కోరుకుంటారు. కానీ ఐఫోన్‌ వినియోగదారులు మాత్రం ఆండ్రాయిడ్‌ ఫోన్ తీసుకోవాలని అస్సలు కోరుకోరు. మీరు ఎప్పుడైనా యాపిల్ ఐఫోన్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారుని ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఉపయోగించాలనుకుంటున్నారా అని ప్రశ్న అడిగితే అవును అని సమాధానమిచ్చేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఐ ఫోన్ వినియోగదారులకు నచ్చని ఫీచర్స్ ఏమిటి.. అసలు ఎందుకు ఇష్టపడరు ఇప్పుడు తెలుసుకుందాం.

యాపిల్ కంపెనీ ఐఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ల కంటే సురక్షితమైనదని మనందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఫోన్ హ్యాకింగ్ సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులు ఫోన్ లో సమాచార గోప్యత, భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. అందుకే ఐఫోన్ వినియోగదారులు ఆండ్రాయిడ్‌కి మారరు. ఇప్పటి వరకు భద్రత విషయంలో ఆండ్రాయిడ్ కంటే యాపిల్ చాలా మెరుగ్గా ఉందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది యాపిల్ ఫోన్ వాడడం స్టేటస్ సింబల్ గా అనుకుంటారు. ఇలాంటి వారు కూడా ఆండ్రాయిడ్‌కి మారడానికి ఇష్టపడరు.

Advertisement

Next Story

Most Viewed