చేతికి కంకణం ఎందుకు కట్టుకుంటారు..? లాభమా.. నష్టమా..?

by Dishaweb |
చేతికి కంకణం ఎందుకు కట్టుకుంటారు..? లాభమా.. నష్టమా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : నాడి పట్టుకుని చూసి స్త్రీ గర్భవతా, కాదా అని చెప్పగలరు. అంతటి విశిష్టత కలిగిన ఆ స్థానంలో జీవనాడుల ఉద్దీపన కొరకు పూజా సమయంలో కంకణమును ధరించే ఆచారం అనాది నుండి కొనసాగుతుంది. శుభ కార్యాల్లో, యజ్ఞయాగాదుల్లో చేతికి కంకణం కట్టుకొవడం ఆచారంగా భావిస్తాం. చేతికి కట్టుకొనే కంకణం వల్ల ఉపయోగం ఉంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.

కంకణం పురుషులకు కుడి చేతికి, స్త్రీలకు ఎడమ చేతికి కడతారు. చేసిన పూజా ఫలం, భావనా తొలగిపోకుండా, ఆ కంకనం ఉన్నంత వరకు అదే భావన, ప్రశాంతత సిద్ధిస్తుందని నూలుధారానికి పసుపు రాసి ముంజేతి మణికట్టుకు కడతారు. కంకణ ధారణ వల్ల ఆధ్యాత్మికమైన ప్రయోజనంతోపాటు మరో ప్రయోజనం కూడా ఉంది. శరీరంలోని జీవనాడుల్లో ముఖ్య నాడి చేతులు మణికట్టు భాగం వరకు ఉంటుంది. కంకణం కట్టుకోవడం వల్ల, ఆ భాగంలో కలిగే ఒత్తిడి, రక్త ప్రసరణలతో పాటు హృదయ స్పందన సరళ రీతిలోకి వస్తుంది. అక్కడ ఉన్న నాడి గర్భాశయం వరకు ఉంటుంది. కంకణం కట్టుకోవడం వల్ల నాడీ వ్యవస్థ కూడా సక్రమంగా పని చేయడంతోపాటు రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. అందుకే అటు శాస్త్రం ప్రకారం.. ఇటు సైన్స్ ఏదైనా.. చేతికి కంకణం కట్టుకోవడం ఆరోగ్యానికి మంచిదే.

Advertisement

Next Story

Most Viewed