కొడుకుల జీవితాన్ని నాశనం చేస్తున్న అమ్మ ప్రేమ.. భార్యకు దక్కేది విద్వేషమే..!

by sudharani |
కొడుకుల జీవితాన్ని నాశనం చేస్తున్న అమ్మ ప్రేమ.. భార్యకు దక్కేది విద్వేషమే..!
X

దిశ, ఫీచర్స్: తల్లిని గౌరవించే వ్యక్తి ఆమెను ప్రేమిస్తాడు. జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆమె పట్ల బాధ్యతగా ఉంటాడు. అలాగని పెళ్లయ్యాక భాగస్వామిని కూడా మరవడు. జీవితాంతం తోడుండే తనకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తాడు. అయితే అతిగా పాంపరింగ్ చేయబడిన కొందరు అబ్బాయిలు బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా.. భాగస్వామి కోసం నిలబడకుండా.. సొంత వ్యక్తిత్వం లేకుండా.. ప్రతీ నిర్ణయానికి తల్లిపై ఆధారపడుతుంటారు.

ఇలాంటి వారు దేశంలో చాలా మంది ఉండగా.. ‘మామాస్ బాయ్ సిండ్రోమ్’తో బాధపడుతున్నవారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్వాలిటీస్ మీకు తెలిసిన వారిలో కూడా ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా? దురదృష్టవశాత్తు ఇండియాలో పితృస్వామ్య వ్యవస్థ కారణంగా మన చుట్టూ ఇలాంటి వారు ఉండటం సాధారణమే. కాగా ఇలాంటి ‘అమ్మ కొడుకు’ వల్ల కలిగే అనర్థాలు ఏంటో చూద్దాం.

అనేక కుటుంబాల్లో తల్లులు కూతుర్ల కన్నా కుమారులకే ఎక్కువ సేవ చేస్తారు. వయసొచ్చినా సరే చిన్న పిల్లాడిలో ఉండే కోపం చూపినా.. ఫ్రస్ట్రేషన్‌తో ఉన్నా.. బాధ్యత లేకుండా ప్రదర్శించినా భరిస్తారు. కానీ ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పే సాహసం చేయరు. సొంతంగా నేర్చుకునేందుకు, ఎదిగేందుకు, స్వతంత్రంగా ఉండేందుకు అవకాశం ఇవ్వరు. పైగా కుమార్తె కంటే ఎక్కువ కొడుకునే చదివించడం.. అతనిపై ఎక్కువ పెట్టుబడి పెట్టడం.. అన్నింటిలోనూ ఉత్తమమైనవి అందించడం చేస్తుంటారు. దీంతో రెస్పాన్సిబిలిటీస్ మరిచి.. కంఫర్ట్ జోన్స్‌లో ఉండటానికి అలవాటుపడుతున్న వారు.. స్త్రీద్వేషపూరిత పురుషులుగా ఎదుగుతున్నారురు. అయితే తల్లికి మాత్రం విశ్వాసపాత్రులుగా ఉండటంలో ముందుంటున్నారు.

ఇలాంటి పురుషులు తామే గొప్ప అని, ఉన్నతులమనే అభిప్రాయంతో ఉండటం మూలంగా స్త్రీని సమానంగా చూడలేకపోతుంటారు. ఏదైనా సలహా ఇచ్చినా, సమాధానం చెప్పినా తీసుకోలేకపోతుంటారు. అమ్మాయి పుట్టింది మగవాడి అవసరాలను తీర్చేందుకే తప్ప మరో కారణం లేనట్లుగా ప్రవర్తిస్తారు. సమానత్వం అనే భావనను తీసుకోలేకపోతుంటారు. ఇలాంటి మనస్తత్వానికి కారణం తల్లి పెంపకమే అంటున్నారు నిపుణులు. తమ ప్రేమతో కంట్రోల్‌లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే.. భారతీయ సాంప్రదాయంలో కొడుకుకు పెళ్లి చేస్తే కోడలు ఇంటికి వచ్చేస్తుంది. అయితే ఈ కుమారుడు తమ స్వాధీనంలో ఉంటేనే వృద్ధాప్యంలో బాగా చూసుకుంటాడు కాబట్టి అంతగా ప్రేమను అందిస్తారు. ఆ ఆప్యాయతతో కొడుకుల మనుసును కుళ్లిపోయేలా చేస్తారు. దీన్ని కొందరు వ్యతిరేకించినప్పటికీ ఇదే జరుగుతుందనేది నిజం అంటున్నారు విశ్లేషకులు.

ఈ మామాస్ బాయ్ సిండ్రోమ్ ఫలితంగా అహంకారంతో పెరిగిన కొడుకులు కొన్ని సందర్భాల్లో ఇతర మహిళలతో పాటు తల్లిని కూడా గౌరవించలేరు. ఆహారం అందించడం, బట్టలు ఉతకడం, వార్డ్ రోబ్ నిర్వహించడం, బాత్రూమ్ శుభ్రయం చేయడం వరకు అన్నీ తల్లే చూసుకుంటుంది. అయితే పెళ్లయ్యాక భర్త నుంచి సమానత్వాన్ని కోరుకున్న భార్య నుంచి ఇవన్నీ పొందలేని కొడుకు.. ఎలాగూ తల్లి దగ్గర లభించే కంఫర్ట్ జోన్‌లోకే వెళ్లిపోతాడు.

దీంతో భార్యాభర్తల మధ్య ఎంటరైన తల్లి వల్ల స్పష్టంగా ఆ బంధం క్షీణించడం ప్రారంభం అవుతుంది. కొత్తగా వచ్చిన కోడలికి కష్టాలు ఆరంభమవుతాయి. అందుకే తల్లులు తమ కుమారులను ప్రేమించడం సరైందే కానీ అదే టైమ్‌లో స్వతంత్రంగా పెంచడం అవసరమని గ్రహించాలి అంటున్నారు నిపుణులు. అప్పుడే వ్యక్తిగత జీవితం, ఇతరులతో సంబంధాలను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకుంటారని చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed